NewsOrbit
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ బిగ్ స్టోరీ

నీతూ అంబానీ కళ్ళలో ఆనందం కోసం ….. ముంబై వరుస విజయాల వెనుక రహస్యం ఏంటీ ?

 

ఐపీఎల్ భారతీయ క్రికెట్ అభిమానుల్ని ఉర్రుతలు ఊగించే ఓ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్. దాదాపు 2 నెలల పాటు పండగే పండగ. 2008 నుంచి మొదలైన ఈ ఐపీఎల్ హంగామాలో 8 జట్లు తమ ఆటతీరుతో ఆకట్టుకుంటే.. టైటిల్ రేసులో మాత్రం ముంబై టీమ్ దూసుకుపోతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ టీమ్ 14 సార్లు ఐపీఎల్ జరిగితే దానిలో 5 పర్యాయాలు విజేతగా ఆవిర్భవించింది. అసలు ఈ టీమ్ విజయాల వెనుక ఉన్నది ఎవరు..? ఇతర జట్ల బలాబలాలతో పోలిస్తే ముంబైకు కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించే శక్తీ ఎవరు ? ముంబై జట్టు విషయంలో ముకేశ్ అంబానీ ప్రమేయం ఎంత ? అంబానీ ఎంతో ఇష్టంగా ప్రేమించే నీతూ అంబానీ ముంబై గెలవకపోతే ఎంతో వేదన చెందుతారా..? ఆమె సంతోషం కోసం ముంబై టీమ్ గెలుపు కోసం అంబానీ కష్టపడుతున్నారా? అనే బోలెడు ప్రశ్నలకు .. కొన్ని సమాధానాలు ఉన్నాయి. ముంబై వరుస విజయాల వెనుక కొన్ని అంతులేని విషయాలు కనిపిస్తాయి.

 

* నీతూ అంబానీకు క్రికెట్ అంటే చాల ఇష్టం. ఆ ఇష్టంతోనే ఐపీఎల్ సీజన్ మొదలు అయినపుడు పట్టుబట్టి మరీ ముకేశ్ అంబానీతో ముంబై ఫ్రాంచైజీ కొనిపించారు. ముకేశ్ కు దీని మీద అంత ఇంట్రెస్ట్ లేకున్నా భార్య మాట కాదనలేక ముంబై ఇండియన్స్ ను 111 . 9 మిలియన్ డాలర్లు అంటే 830 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కొనుగోలు చేసారు. ఇది ఐపీఎల్ లో ఇతర జట్ల ఫ్రాంచైజీ రేట్లతో పోలిస్తే అత్యధికం. తర్వాత జట్టు పూర్తి నిర్వహణ బాధ్యతలు నీతూ అంబానీ చూసుకుంటున్నారు.
* ఏటా జరిగే ఐపీఎల్ టోర్నీ ప్రారంభంలో ముంబై కనీసం ప్లేఆఫ్ చేరలేదు. తర్వాత అయిదేళ్ల పాటు కప్పు దక్కలేదు. తమ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ ను ఎన్ని పనులున్నా స్టేడియం వరకు వచ్చి చూసే అలవాటు ఉన్న నీతూ వరుసగా ఐదేళ్లు ముంబై ఓడిపోవడంతో తీవ్రమైన ఆవేదన చెందారు. ఒకానొక టైములో జట్టులోని సభ్యులపై ఆమె అంత సంతోషంగా లేకపోవడం కనిపించింది. ముంబై మ్యాచ్ లు అదే సమయంలో ముభావంగా కూర్చునే వారు.
* 2009 ఎడిషన్ ముంబై మరింత దిగజారి 7 వ ప్లేసుకు వెళ్ళిపోయింది. 2010 లో ఫైనల్ చేరిన చెన్నై చేతిలో ఓటమితో నీతూ చిన్న పిల్లలా బాదపడినట్లు ఓ ఇంటర్వ్యూ లో సచిన్ చెప్పాడు. తర్వాత రెండు ఎడిషన్స్ లో అదే పరాభవం ఎదురైనపుడు నీతూ తన బాధను బహిరంగంగానే టీమ్ సభ్యుల వద్ద వెళ్ళగక్కారని చెబుతారు.
* సచిన్ వంటి దిగ్గజ ఆటగాడు కెప్టెన్ గ ఉంటూ బలమైన బ్యాటింగ్ లైన్ అప్ , బౌలర్లు ఉన్న సమయంలోనే ముంబై కప్పు అందుకోలేకపోయింది. హర్భజన్ సింగ్ కెప్టెన్ అయినా తర్వాత 2013 లో చెన్నై మీద ఫైనల్ ఆడిన ముంబై మొదట బ్యాటింగ్ చేసి 148 పరుగులే చేసిన చెన్నై ను 125 కె కట్టడి చేయడం విశేషం. ఇది నీతూ కి దక్కిన మొదటి విజయం. దీని కోసం ఎప్పుడు స్టేడియం కు రాని ముకేశ్ అంబానీ సైతం ప్రత్యేక ఛాపర్ లో కోల్కతా వచ్చి ఫైనల్నీ నీతూ పక్కనే మ్యాచ్ ఆసాంతం కూర్చుని మ్యాచ్ అయ్యాక ఆమెతో సంతోషం పంచుకుని తిరుగుపయనమయ్యారు.
* దాని తర్వాత నీతూ లో ఆనందం కొట్టచ్చినట్లు కనిపించేది. స్వచ్ఛంద సంస్థలు, పలు కంపెనీల బోర్డు డైరెక్టర్ గ ఉన్న నీతూ ఉత్సహం రెండు ఇంతలు అయ్యింది. ఇది ముఖేష్ అంబానీకి తెగ నచ్చింది. తర్వాత ముంబై ఏడాది గ్యాప్ తో వరుసగా కప్పులు సాధించింది. గత ఏడాది కప్పు సాధించి, ఈ ఏడాది గ్యాప్ లేకుండానే మరో ఐపీఎల్ సాధించి పెట్టి నీతూకి కరోనా వేళలో ఫుల్ జోష్ నింపే విజయాన్ని జట్టుతో పాటు, ముఖేష్ అందించారు.

 

Hyderabad Mumbai Indians co owners Nita Ambani and Akash Ambani with captain Rohit Sharma and his wife Ritika Sharma after winning IPL 2017 at Rajiv Gandhi International Stadium in Hyderabad on May 21 2017 Photo IANS

* కేవలం నీతూ అంబానికే కాదు.. వారి పిల్లలు ఆకాష్, అనంత్ అంబానీలు ఐపీఎల్ సీజన్ లో మరేం పనులు పెట్టుకోకుండా క్రికెట్ ఎంజాయ్ చేస్తారు. ఇంటి అందరు సంతోషం కోసం ముకేశ్ ముంబై విజయాల్లో తెరవెనుక ప్రణాళికలు రచిస్తారు. కప్పు గెలిచినా టీమ్ కు పెద్దగా పారితోషకం ఉండదు. ఆ పారితోషకం ఎదో మిగిలిన టీమ్ల ఫ్రాంచైజీలకు తమ సంతోషంలో భాగంగా అందించేందుకు, భార్య కోసం ఖర్చు చేసేందుకు అంబానీకి పెద్ద విషయం కాదు. అయితే ప్రతి ఏటా వరుస విజయాలు తమ జట్టుకి రాకుండా ఉన్నతంగా అలోచించి ఏడాది గ్యాప్ ఇచ్చి కప్పులు పట్టుకుపోవడం ముంబై కు మాత్రమే సాధ్యం.

author avatar
Special Bureau

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri