Iron Deficiency: రక్తహీనత, బలహీనత, కీళ్ల నొప్పులు తగ్గించి.. శక్తిని పొందడానికి ఇది ఒక్కటి తింటే చాలు..!!

Share

Iron Deficiency: మానవ శరీరంలో ప్రతి అవయవానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు లభిస్తేనే సక్రమంగా పనిచేస్తుంది.. వాటిలో శరీరానికి ఏది అందకపోయినా శక్తివంతంగా పని చేయలేదు.. ముఖ్యంగా దేహానికి ఐరన్ ముఖ్యమైనది.  ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నప్పుడు దోహదపడుతుంది. హిమోగ్లోబిన్ తయారీ, ఎర్రరక్త కణాలకు ప్రోటీన్ అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతే మానవ కండరాలకు తగిన ఆక్సిజన్ అందక అవి సరిగ్గా పని చేయవు.  ఐరన్ డెఫిషియన్సీ వలన రక్తహీనత ఏర్పడుతుంది.  తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు..!! ఐరన్ లోపం వల్ల రుతుస్రావం సరిగ్గా రాదు..!! అలసట, బలహీనత, తల నొప్పి, ఛాతీ నొప్పి, కాళ్లు నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి..!! వంటింట్లో లభించే పదార్థాలతో ఐరన్ లోపం కు చెక్ పెట్టవచ్చు..!! ఐరన్ కు చెక్ పెట్టే చక్కటి లడ్డూను తయారు చేసుకోని ప్రతిరోజు ఒక్కటి తింటే చాలు..!! అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Iron Deficiency: Excellent home remides
Iron Deficiency: Excellent home remides

Iron Deficiency: ఐరన్ డెఫిషియన్సీ కి శాశ్వతంగా చెక్ పెట్టడానికి ఈ చక్కటి లడ్డూ ఒక్కటి తింటే చాలు. !!

కావలసిన పదార్థాలు :
తెల్ల నువ్వులు – అరకప్పు, ఆక్రోట్ – అర కప్పు, నల్ల బెల్లం – అర కప్పు, నెయ్యి – అర కప్పు.

తెల్ల నువ్వులు, ఆక్రోట్, బెల్లం తురుము వేసి మిక్సి పట్టుకోవాలి. బెల్లం బదులు పటిక బెల్లం ఉపయోగించుకోవచ్చు. ఈలా తయారు చేసుకున్న పొడి లో నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు ప్రతి రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Iron Deficiency: Excellent home remides
Iron Deficiency: Excellent home remides

నువ్వులు శరీరానికి తగినంత ఐరన్ను అందిస్తాయి. ఇందులో క్యాల్షియం, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఆక్రోట్స్ శరీరానికి ఎంత మేలు చేసే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆక్రోట్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వదు. బెల్లం లో కూడా ఐరన్ ఉంటుంది.  ఇది శరీరానికి చలువ చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. నెయ్యి శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తుంది. వీటన్నింటి తో కలిపి తయారుచేసుకున్న లడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు ఈ లడ్డు ఒకటి తీసుకుంటే ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. స్త్రీల లో వచ్చే అనేక రకాల రుతు సంబంధిత సమస్యలు నుంచి బయటపడేస్తుంది. పిల్లలు త్వరగా ఎత్తు ఎదుగుతారు. మంచి శరీర పుష్టి కలుగుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది . నీరసం, అలసట దరిచేరనివ్వదు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చక్కటి పరిష్కారంగా చెబుతారు ఆరోగ్యనిపుణులు. మీరు ఈ లడ్డూలను తయారు చేసుకొని ప్రతి రోజు ఒకటి తినండి చాలు. అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా చేస్తుంది.

Read More :

Shampoo: మీరు తలస్నానం చేసేటప్పుడు చేసే తప్పులు ఇవే..!! ఇలా ట్రై చేసి చూడండి..!!

Disc Problems: ఎముకల సమస్యకు అద్భుతమైన ఇంటి మందు..!!

BP Sugar Diet: బీపీ, షుగర్ ఉన్నవారికి సూపర్ డైట్ ఇది.. పాటిస్తే ఆ రోగాలు మటుమాయం..!!


Share

Related posts

Tirumala : తిరుమల శ్రీవారికి పొస్కో సంస్థ భారీ విరాళం

somaraju sharma

బిగ్ బాస్ 4 : దసరా రోజు సర్ప్రైజ్ సెలబ్రిటీలు..! ఎవరంటే…

arun kanna

అందంగా ఆరోగ్యం గా బరువు తగ్గాలంటే ఇవి తినండి!!

Kumar