ట్రెండింగ్ న్యూస్ సినిమా

ISHQ: హృదయాలను తాకుతున్న “చీకటి చిరుజ్వాలై” లిరికల్ సాంగ్..!!

Share

ISHQ: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన తేజ సజ్జ జాన్ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ఇష్క్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి తాజాగా ఈ చిత్రం నుంచి “చీకటి చిరుజ్వాలై” లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్..!! శ్రీమణి ఈ పాటను రాయగా అనురాగ్ కులకర్ణి, ఉమా నేహ ఈ పాటను ఆలపించారు.. మహతి అందించిన సంగీతం ఈ పాట హైలెట్ గా నిలిచింది..!!

ISHQ: Cheekati Chirujwaalai Lyrical video song out
ISHQ: Cheekati Chirujwaalai Lyrical video song out

ఈ పాట విడులైన కొద్ది సేపట్లోనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.. ఈ పాట వింటుంటే లవ్ బ్రేక్ ఆప్ సాంగ్ లా ఉంది.. కానీ ఈ చిత్రానికి “నాట్ ఎ లవ్ స్టొరీ” అనేది ట్యాగ్ లైన్.. ఈ సస్పెన్స్ విడాలంటే జూలై 30 వరకు వేచి చూడక తప్పదు.. ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్ బీ చౌదరి సమర్పణలో ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదల కావలసి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది.. జూలై 30 న థియేటర్లలో తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ సందడి చేయనున్నారు..


Share

Related posts

మీ నాన్నను చూసి నేర్చుకో జగన్ ! వైకాపాలోనే ఈ కామెంట్ పడింది !!

Yandamuri

‘నిధుల మళ్లింపు అవినీతా?’

somaraju sharma

Bigg Boss 5 Telugu: ఆ టైంలో నేను ఉంటే సిరి చెంప పగలగొట్టే వాడిని..జెస్సీ వైరల్ కామెంట్స్..!!

sekhar