తన హాట్ హాట్ అందాలతో బుల్లితెరపై మెరిసిన ప్రముఖ యాంకర్ అనసూయ. ఆమె కెరియర్‌కు బుల్లితెర షో “జబర్ధస్త్ కామెడీ షో” ఎంతగానో బూస్ట్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ షోలో హోస్టుగా కొనసాగుతున్న తరుణంలోనే బుల్లితెరపై తన నటనా, యాంకరింగ్‌లతో అదరగొట్టడంతో సినిమా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర.. అనసూయకు మంచి పేరును సంపాదించిపెట్టింది.
అనసూయ అనే కంటే రంగమ్మత్త అంటేనే టక్కున గుర్తుపట్టేలా ఆ పాత్రలో ఒదిగి నటించింది ఆమె. దీంతో ఇప్పుడు అనసూయకు భారీగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు ఆమె సైన్ చేసింది. తాజాగా కోలీవుడ్లోకి కూడా అడుగుపెడుతున్నానంటూ.. సరికొత్త ఆరంభం కాబోతున్నదని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తమిళ హీరో విజయ్ సేతుపతితో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఇది మొదట ఓ షో లేదా ఇంటర్వ్యూ కోసమని అందరూ భావించారు. కానీ హీరో విజయ్ హీరోగా నటించబోయే చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపింది.
తాజాగా సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా అద్దంలో తనను చూసుకుంటున్న మరో ఫొటోని షేర్ చేసింది అనసూయ. “మరో మంచి కథతో జీవితాన్ని కొనసాగించనున్నాను. సరికొత్త ప్రారంభం.. కోలీవుడ్, తమిళనాడు” అని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను కూడా సిల్క్ స్మితను ఆధారంగా చేసుకుని దిగినట్లు అనసూయ పేర్కొంది. దీంతో అనసూయ..వెండితెరపై సిల్క్ స్మితగా తన హాట్ హాట్ అందాలతో అదరగొట్టడానికి సిద్ధమవుతున్నట్టు చేప్పకనే చెబుతోంది.
అయితే, హీరో విజయ్, అనసూయలు నటిస్తున్న ఈ సినిమా సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారా? లేక ఈ సినిమాలో అనసూయ మాత్రమే సిల్క్ స్మితగా నటిస్తున్నారా? అనే చర్చ నడుస్తోంది. ఏదేమైనప్పటికీ ఆమె షేర్ చేసిన ఫొటో మాత్రం ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తూ వైరల్ అవుతోంది. కానీ ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్ బాలీవుడ్ “డర్టీపిక్చర్”లో నటించి.. విద్యాబాలన్ నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరీ అనసూయ.. సిల్క్ స్మితగా వస్తుందో ? రాదో ? త్వరలోనే తెలియనుంది.