NewsOrbit
ట్రెండింగ్

AP Job notificatation: ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాలుగు వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్..!!

AP Job notificatation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏదో రూపంలో యువతకు ఉద్యోగాలు వచ్చేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వైయస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ….ఇప్పటివరకు ఒక ఉద్యోగ కాలెండర్ రిలీజ్ చేయకపోవటంతో ప్రతిపక్షాల నుంచి ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జాబ్ క్యాలెండర్ లో కంటే ఎక్కువగా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా… గత కొద్ది రోజుల నుండి కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  నెల రోజుల క్రితం గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ లో రిలీజ్ చేయగా తాజాగా… ప్రభుత్వ ఆరోగ్య వైద్య.. శాఖకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసే రీతిలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 4775 ఖాళీలను భర్తీ చేసే విధంగా.. ప్రకటన జారీ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. జోన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. జోన్-1(విశాఖపట్నం)లో 974, జోన్-2(రాజమండ్రి)లో 1446, జోన్-3(గుంటూరు)లో 967, జోన్-4(కడప) 1368 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 4775. (ఫొటో: http://hmfw.ap.gov.in/)

ఈ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7న ప్రారంభం కాగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 16వ తేదీని నిర్ణయించారు. అదేవిధంగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. అంతమాత్రమే కాదు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రాం కూడా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధి వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

 ఇంకా.. ఫైనల్ మెరిట్ లిస్ట్ & ఎంపికైన అభ్యర్థుల వివరాల ప్రకటన ఏప్రిల్ 25న ఉంటుంది. అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాల స్వీకరణ ఏర్పిల్ 26న ఉంటుంది. ఇంకా తుది ఎంపిక వివరాల ప్రకటన ఏప్రిల్ 27న ఉంటుంది. ఇంకా ఎంపికైన వారికి కౌన్సెలింగ్ ఏప్రిల్ 28 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. (ఫొటో: http://hmfw.ap.gov.in/)

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎలా అప్లై చేయాలి అంటే hmfw.ap.gov.in, cfw.ap.nic.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బిఎస్సి నర్సింగ్ కోర్సులో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా.. ఫైనల్ అభ్యర్థుల సెలక్షన్ ఉంటుంది. ఈ క్రమంలో మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 20వ తారీఖున ప్రకటించనున్నారు. ఇక ఇదే సమయంలో అభ్యంతరాల స్వీకరణ ఏప్రిల్ 23 వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఇంకా ఫైనల్ మరియు మెరిట్ లిస్ట్ ఎంపికైన అభ్యర్థుల వివరాల ప్రకటన ఏప్రిల్ 25 వ తారీఖున ఉంటుంది. అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాల స్వీకరణ ఏప్రిల్ 26వ తారీఖున ఉంటుంది. ఇంకా తుది ఎంపిక వివరాల ప్రకటన ఏప్రిల్ 27న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి కౌన్సిలింగ్ ఏప్రిల్ 28 నుంచి 30 వరకు ఉంటుంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju