Jathi Ratnalu : జాతి రత్నాలు సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్రయూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు..!! తాజాగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ నుండి కూడా జాతి రత్నాలు టీమ్ ని సర్ ప్రైజ్ చేశారు..!!
జాతి రత్నాలు సినిమా లో నవీన్ పోలిశెట్టి.. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ ఒక చిల్లర గ్యాంగ్ లా ఉంటారు. వారి పోస్టర్లు చాలావరకు ట్రెండ్ అయ్యాయి. అందులో ఒక పోస్టర్ ను ఇలా రాజమౌళి.. ఎన్టీఆర్.. చరణ్ తో మార్పు చేసి జాతిరత్నాలు టీం కు చిన్న సర్ప్రైజ్ అంటూ ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా అధికారిక పేజీల్లో షేర్ చేసి బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. జక్కన్న టీం నుండి జాతిరత్నాలు బెస్ట్ విషెస్ ను అందించడంతో పాటు ఆ ముగ్గురు కూడా జాతిరత్నాలు పోస్టర్ లో ఎక్కడం తో సినిమా క్రేజ్ మరింత పెరిగింది అనటంలో ఎలాంటి సందేహం లేదు..