Jathi Ratnalu : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా తో కడుపుబ్బ నవ్వించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు..!! కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ సినిమా పై స్పందించారు.. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ సేపు ఎప్పుడు నవ్వలేదంటూ చిత్ర యూనిట్ ను ప్రశంసించారు.. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేసారు..!!
నిన్న రాత్రి జాతిరత్నాలు చూశాను. నవీన్ పోలిశెట్టి అద్భుతంగా నటించాడు. అప్ కమింగ్ హీరోగా నవీన్ నటన ఆకట్టుకుంటోంది. రాహుల్ చాలా సునాయాసంగా నటించాడు. ప్రియదర్శి, ఫరియా నటన ఎంతో ప్రశంసనీయంగా ఉంది. ఈ సినిమాను నిర్మించిన నాగ్ అశ్విన్, స్వప్న దత్ , ప్రియాంక దత్ లకు అభినందనలు. రథన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ నా అభినందనలు. ఇక చివరిగా డైరెక్టర్ అనుదీప్ కి మా అందరినీ ఇంత బాగా నవ్వించినందుకు స్పెషల్ థాంక్స్.. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.. మీ బ్రెయిన్ ని స్విచాఫ్ చేసి సినిమాకు వెళ్లి ఫన్ ని పొందండి అంటూ బన్నీ ట్వీట్ చేశారు..
https://twitter.com/alluarjun/status/1370235388002930688?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1370235388002930688%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fallu-arjun-review-jathi-ratnalu-1349240