Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ముగిసిన తర్వాత హౌస్ లో కంటెస్టెంట్ లు బయటకు వచ్చాక చాలావరకు సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్లో ఉంటూ వస్తున్నారు. అంత మాత్రమే కాక మరో పక్క మీడియా చానల్స్ కి యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో లైవ్ లో కూడా కనిపిస్తున్నారు. అందరూ కనిపిస్తున్నా గాని సిరి, షణ్ముక్ పెద్దగా ఇంటరాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఫైనల్ ఎపిసోడ్ గత ఆదివారం తర్వాత వీరిద్దరూ ఎక్కడా కనిపించలేదు.
కానీ విన్నర్ సన్నీ(Sunny), మానస్(Manas), కాజల్(Kajal) ముగ్గురు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఇదే తరుణంలో సిరికి హగ్ లు ఎక్కువ ఇవ్వడం వల్లే షణ్ముక్ ఓడిపోయినట్లు… ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా బయట రిలేషన్ కూడా డ్యామేజ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో జెస్సీ(Jessy) వీరిద్దరితో రెస్టారెంట్ లో కూర్చున్న వీడియో తో పాటు సిరి(Siri) నూడిల్స్ తినటం తో పాటు పక్కనే షణ్ముక్ కూర్చున్న వీడియోను పోస్ట్ చేసి మేమంతా వచ్చేసాం… నన్ను తెగ దోబెస్తున్నారు. సిరి భోజనం చేయటం లేదని విడిపోయారని ఇక్కడ అంతా బాగానే ఉన్నారు.. అంటూ హోటల్లో మాత్రమే కాక షణ్ముక్(Shanmukh) డ్రైవ్ చేస్తున్న కారులో.. కూడా వీడియో తీసి జెస్సీ పోస్ట్ చేయడం జరిగింది.
దీంతో ఈ ముగ్గురు విడిపోయినట్లు వచ్చిన వార్తలకు పులిస్టాప్ పెట్టినట్లు అయింది. జెస్సీ, సిరి, షణ్ముక్ ముగ్గురు మంచి స్నేహితులుగా హౌస్ లో అలరించటం మనం చూశాం. త్రిమూర్తులు అనే పేరు కూడా మిగతా కంటెస్టెంట్ లు వేళ్ళకు పెట్టారు. కాగా అనారోగ్యం కారణంగా జెస్సీ ఇంటి నుండి వెళ్లిపోవడం.. తోపాటు షణ్ముక్ .. సిరి టాప్ ఫైవ్ లో ఉండటం .. టైటిల్ గెలుస్తాడని అనుకున్న షణ్ముక్ ఓడిపోవడం.. ఈ ముగ్గురిని ఇష్టపడే అభిమానులకు షాక్ ఇచ్చినట్లు అయింది. అయితే సీజన్ ఫైవ్ ట్రోఫీ ప్రకటించిన తర్వాత… బయట కూడా మాట్లాడుకోవడం లేదని వార్తలు రావడంతో ఈ సమయంలో..జెస్సీ… సిరి, షణ్ముఖ్ లతో కలిసి ఉన్న వీడియో రిలీజ్ చేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.