Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) సీజన్ ఫైవ్ సగం పూర్తి అయిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఇంటిలో తొమ్మిది మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. బుధవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఐదుగురు నామినేట్ అయ్యారు. ఇటువంటి తరుణంలో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ ఈ వారం అవుతారు అన్నదానిపై ఆసక్తికరంగా పరిస్థితి మారింది. విషయంలోకి వెళితే ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో రవి(Ravi), సన్నీ(Sunny), మానస్(Manas), కాజల్ (Kajal), సిరి(Siri) వంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు.
ఈ తరుణంలో గత కొన్ని వారాల నుండి జెస్సీ వేర్టిక… అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. భారీగా నొప్పులు వస్తూ ఉండటంతో పాటు కళ్ళు కూడా.. సరిగ్గా కనబడని పరిస్థితి. ఈ క్రమంలో దీపావళి ఎపిసోడ్ అంతకుముందు సమయంలో కూడా జెస్సీ(Jessy) బాగా బాధ పడటం జరిగింది. అయితే నిన్ననే మెడికల్ రూమ్ కి.. వెళ్లినా గాని పరిస్థితి మారక పోవడంతో ఈరోజు ఎపిసోడ్ లో ఇంటినుండి జెస్సీని బిగ్ బాస్(Big boss) పంపించేయడం జరిగింది.
గుక్క పెట్టీ ఏడ్వటం…
ఈ క్రమంలో మొదటి నుండి హౌస్ లో జెస్సి(Jessy) తో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ సిరి, షణు బిగ్బాస్ తీసుకున్న నిర్ణయానికి భోరున ఏడ్చేశారు. జెస్సీ కూడా ఇద్దరిని పట్టుకొని… గుక్క పెట్టీ ఏడ్వట్టం జరిగింది. దాదాపు 60 రోజులకు పైగానే హౌస్ నడవగా… అందులో సగానికి పైగా వీరి ముగ్గురి జర్నీ చాలా అద్భుతంగా స్క్రీన్ ప్రెజెన్స్ లభించింది. ఈ తరుణంలో ఒక్కసారిగా అనారోగ్యం కారణంగా జెస్సీ… ఇంటి నుండి వెళ్లిపోవాల్సిందిగా పరిస్థితి రావడంతో సిరి(Siri), షణ్మక్ (Shanmukh) తో పాటు.. మిగతా ఇంటి సభ్యులు కూడా బాగా బాధ పడ్డారు. ఎంత అనారోగ్యం ఉన్నాగాని జెస్సీ అద్భుతంగా పోరాటంతో.. ఇంటి నుండి వెళ్లిపోవడంతో మిగతా ఇంటి సభ్యులు స్ట్రాంగ్ ప్లేయర్ జెస్సీ అంటూ.. బాధపడుతూ సాగనంపారు.