ట్రెండింగ్ న్యూస్ సినిమా

Jetti Movie: జెట్టీ సినిమా మొదటి పాటను విడుదల చేసిన వేణు ఉడుగుల..!!

Share

Jetti Movie: భారతదేశంలో మొదటి సారిగా హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం జెట్టీ.. నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ నూతన కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు.. తాజాగా సినిమా లోని మొదటి పాట “దూరం కరిగినా.. మౌనం కరుగునా”.. పాటలు వేణు ఉడుగుల రిలీజ్ చేశారు. శ్రీమణి గారు రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు.

Jetti Movie: dooram karigina song released by Venu udugula
Jetti Movie: dooram karigina song released by Venu udugula

ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. దక్షిణ భారతదేశంలోనే సరికొత్త సముద్రపు కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు తెరపై ఇంతవరకు చూడని మత్స్యకారుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  వేణు ఉడుగుల విడుదల చేసేలా ఈ సినిమా పాట కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.. ఈ కథ నేను విన్నాను, చాలా బాగుంది, ఖచ్చితంగా విజయం అవ్వాలని ఆశిస్తున్నాను అంటూ వేణు ఉడుగుల చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా మొత్తం నాలుగు భాషల్లో విడుదల కానుంది.


Share

Related posts

విశాఖలోని టిఫెన్ సెంటర్ వద్ద భారీ పేలుడు

somaraju sharma

పవన్ బర్త్ డే నాడు హరిహర వీరమల్లు నుండి సరికొత్త అప్డేట్..??

sekhar

లోక్ సభ స్పీకర్ తో రఘురామకృష్ణరాజు భేటీ

Muraliak