శ్రీముఖి గుండెల్లో ఏముందో కళ్లల్లో తెస్తుందంటున్న జానీ మాస్టర్?

అదుర్స్ అనే ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా బుల్లితెరకు పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన బ్యూటీ యాంకర్ శ్రీముఖి. తన అల్లరి చేష్టలతో కుర్రకారు మనసును కొల్లగొట్టింది ఈ బ్యూటీ క్వీన్. అందం, అల్లరి చేష్టలతోనే యాంకరింగ్ చేస్తూ ప్రముఖ యాంకర్స్ లలో ఒకరిగా వెలుగొందుతుంది . ప్రముఖ టీవీ షో లు చేస్తూ రోజు రోజుకు తన ఇమేజ్ ను అమాంతం పెంచకుంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రతి పండగకు వచ్చే స్పెషల్ ఈవెంట్ లో ఈ బ్యూటీ పక్కాగా ఉండాల్సిందే. తన చిలిపితంతో, అల్లరి నవ్వులతో ఆ షోను మరింత సక్సెస్ చేయడానికి ఈ ముద్దుగుమ్మ ఎంతో అవసరం.

బుల్లి తెర మీదే కాకుండా ఈ బ్యూటీ వెండితెర మీద కూడా తన పర్ఫామెన్స్ ను కనబరుస్తూ ఉంటుంది. 2012 లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమా ద్వారా శ్రీముఖి వెండితెరమీద అడుగుపెట్టింది. దాని తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా మారింది. దాని తర్వాత ఈ ముద్దుగుమ్మ అనేక స్టార్ సినిమాల్లో డిఫరెంట్ పాత్రలో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. తెలుగు, తమిళం, కన్నడం సినిమాల్లో నటిస్తూ ఈ బ్యూటీ మంచి పేరును సంపాదించుకుంటుంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ అధృష్టమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ ఇంట్లో తన ప్రవర్తన ద్వారా ఎంతో మందిని తన అభిమానులుగా మార్చేసింది. హౌస్ లో కంటెస్టెంట్ అందరిలో కెల్లా బెస్ట్ పర్ఫామెన్స్ ను అందించి ఫైనల్ వరకు చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫైనల్ కు చేరిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి లో శ్రీముఖినే విన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాని ఎవరూ అనుకోని విధంగా శ్రీముఖి విన్నర్ గా నిలబడలేకపోయింది. కాని అంతవరకు వెళ్లడం చాలా గొప్పవిషయమని నెటిజన్లు ఆమెను అభినందించారు.

అయితే తాజాగా ముద్దుగుమ్మ గుండెలో ఏమనుకుంటుందో కళ్లల్లో కనిపిస్తుంది అని జానీ మాస్టర్ అన్నారట. ఏంటీ జానీ మాస్టర్ శ్రీముఖితో అలా అన్నాడా.. అనుకుంటున్నారా.. అది నిజమేనండి బాబు.. అయితే తాజాగా శ్రీముఖి జీ తెలుగు ఛానెల్ లో ఒక షో లో జానీ మాస్టర్ తో కలిసి ‘గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తోంది’ అంటూ డూయెట్ వేసిందట. అదికాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఈ వీడియోను చూసి శ్రీముఖి మనసులో ఏముందో తెలుసుకోండి.