Jio – Airtel – VI: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ కస్టమర్లకు అలర్ట్..!!

Share

Jio – Airtel – VI: మీరు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ సిమ్ కార్డ్ లను ఉపయోగిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ అలర్ట్.. మీరు సోషల్ మీడియా, వాట్సాప్ లలో మూడు నెలల ఉచిత రీఛార్జ్ మెసేజ్ ను గమనించారా.. ఆ మెసేజ్ ను అసలు నమ్మవద్దు.. ఒకవేళ నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేశారో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు గోవిందా..!!

Jio - Airtel - VI: users have an Alert
Jio – Airtel – VI: users have an Alert

జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్లకు వర్క్ ఫ్రం హోం కోసం మూడు నెలల ఉచిత రీఛార్జి ఉంటున్నట్లు ఆ మెసేజ్ లో ఉంటుంది.. ఈ మెసేజ్ లో ఇచ్చిన రీఛార్జ్ కి సంబంధించి లింక్ పూర్తిగా నకిలీ.. దానిపై క్లిక్ చేస్తే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ చేయడానికి మీ ఆప్షన్ ని ఎంచుకోమని అడుగుతూ ఒక పేజీని తెరుస్తుంది. అక్కడ మీరు మీ బ్యాంక్ వివరాలను అడుగుతుంది. ఇది కాకుండా మీ వ్యక్తిగత సమాచారం కూడా దొంగలిస్తారు. ఈ వైరల్ మెసేజ్ ను PIB ఫాక్ట్ చెక్ చేసింది.. ప్రభుత్వం ఎలాంటి ఆఫర్ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది అంతేకాదు మీకు ఆ మెసేజ్ వచ్చినట్లయితే దానిని ఫార్వర్డ్ చేయవద్దు అని తెలిపింది. అలాంటి లింక్లపై క్లిక్ చేయవద్దు అని హెచ్చరించింది..


Share

Related posts

ఈ టెర్మ్ లోనే ‘అధ్యక్షా’ ఆనాలన్న కమలనాథుల కల సాకారమయ్యేనా?

Yandamuri

టీవీ9 ఊహించని పతనం.! షేర్ల ఢమాల్..!! రీ ఎంట్రీకి రవి ప్రకాష్ స్కెచ్.!!

Srinivas Manem

Today Horoscope జనవరి -8- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha