Jr.NTR : ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ ఒదిగి ఉండే హీరో జూనియర్ ఎన్టీఆర్.. తారక్ వ్యక్తిగత జీవిత జీవితానికి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రావనే విషయం తెలిసిందే.. సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేసే జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలపై ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు.. ఎన్టీఆర్ సరదాగా హైదరాబాద్ రోడ్లపై కనిపించిన సందర్భాలు చాలా అరుదు.. అయితే ఇప్పుడు టైం వచ్చేసింది.. హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టాడు.. తాజాగా తన కొడుకుతో కలిసి హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..
జూనియర్ ఎన్టీఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై మీద తన రెండో కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి బైకుపై నగరంలో చక్కర్లు కొట్టారు.. ఎన్టీఆర్ బ్లాక్ హెల్మెట్ పెట్టుకోక.. భార్గవ్ రామ్ ను ముందు కూర్చోబెట్టుకున్నారు.. వెనుక సీట్లు మరో వ్యక్తి కూర్చున్నారు.. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా లో కొమరం భీమ్ గా నటిస్తున్నారు.. ఆ తర్వాత కొరటాల శివ తో 30 వ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?