Jr.NTR: అభిమానులు తారక్ అడిగిన పుట్టినరోజు కానుకను ఇస్తారా..!?

Share

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే మే 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు..!! ఈ సందర్భంగా అభిమానులకు ట్విట్టర్ వేదికగా కరోనా కాలంలో తనకు పుట్టినరోజు వేడుకలు చేయవద్దు అంటూ విన్నపం చేశాడు..!!

Jr.NTR: requested all fans don't celebrate her birthday
Jr.NTR: requested all fans don’t celebrate her birthday

అభిమానులకు తారక్ విన్నపం..!!

నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను..! ప్రస్తుతం నేను బాగున్నాను.. త్వరలో పూర్తిగా కోలుకుని కరోనా ను జయిస్తానని ఆశిస్తున్నాను.. ప్రతి సంవత్సరం మీరు నా పుట్టిన రోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వాదం గా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి వద్దనే ఉంటూ లాక్డౌన్, కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక..

ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది.. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి.. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం కరోనా ను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం.. అప్పటివరకు మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి. అంటూ తారక్ ఓ లెటర్ ను ట్వీట్ చేశారు.. జూనియర్ ఎన్టీఆర్ కోరినట్టే అభిమానులు ఈ సంవత్సరం వేడుకల చేయకుండా, ఇంటివద్దనే ఉంటూ తారక్ కోరిన విధంగా పుట్టినరోజున అతిపెద్ద కానుకను అందించాలని కోరుకుందాం.


Share

Related posts

సీఎం కేసీఆర్ సారూ.. మాకు ధైర్యం చెప్పండి..!

Srikanth A

బిగ్‌ బ్రేకింగ్ – హుటాహుటిన డిల్లీ బయలుదేరిన జగన్ మోహన్ రెడ్డి ?

sekhar

బ్రేకింగ్ : ముంబైలో “డీసీ అవంతి కార్” కుంభకోణం..! ఓనర్ అరెస్టు..!!

Srinivas Manem