బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ జూనియర్ ఎన్టీఆర్..!!

Share

NTR: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మొదటి సారి కంటే రెండో సారి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని విడిచి పెట్టడం లేదు మహమ్మారి. సెకండ్ వేవ్ లో చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాప్ మోస్ట్ హీరోలు కరోనా బారిన పడుతున్నారు. మొన్న అల్లు అర్జున్ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు.

jr ntr tested corona positive
jr ntr tested corona positive

ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తనకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు స్పష్టం చేశారు. అయితే అభిమానులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని, అంతా బాగానే ఉందని.. తనతోపాటు కుటుంబం మొత్తం ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇటీవల తన ని కలిసిన ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు చేయించుకోవాలి అంటూ ఎన్టీఆర్ కోరారు. అంత మాత్రమే కాక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Share

Related posts

Sonusood : సోనూ సూద్ సహాయం చేయడం చూశారు , సోనూ సిక్స్ ప్యాక్ చూసారా ? ఇంటర్నెట్ ని వేడి పుట్టిస్తోన్న ఫోటో

bharani jella

Kuppam TDp : “న్యూస్ ఆర్బిట్” బ్రేకింగ్ : కుప్పం టీడీపీలో భారీ కుదుపు..! పార్టీకి కీలక నేతల రాజీనామా..!?

Srinivas Manem

ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా

Siva Prasad