ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డల్ గానే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా అరవింద సమేత వచ్చి రెండు ఏళ్లు అయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ ది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో జూ.ఎన్టీఆర్ బిజీ అయిపోయాడు. మధ్యలో కొన్ని ప్రోమోలు వచ్చినప్పటికీ.. ఎన్టీఆర్ ను తెర మీద చూసి రెండేళ్లు అవుతోందని ఫ్యాన్స్ కాస్త డల్ గా ఉన్నారు.
అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్ ఒకటి వచ్చేసింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి సంబురాలు చేసుకోవచ్చు. అది అరవింద సమేత సినిమా రూపంలోనే వచ్చింది.
అరవింద సమేత హిందీ వర్షన్ కోసం రేటు అప్పట్లోనే భారీగా పలికి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హిందీ డబ్బింగ్ కోసం ఏకంగా 18 కోట్లు రేటు పలికి రికార్డు క్రియేట్ చేసింది. కాకపోతే హిందీ డబ్బింగ్ అంతా ఇంకా పూర్తికాలేదు. ఇటీవలే హిందీ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయట. ఇక త్వరలోనే అరవింద సమేత హిందీ వర్షన్ టీవీలో రానున్నది.
జీ సినిమా హిందీ చానెల్ లో ఈ సినిమాను త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా చానెల్ రిలీజ్ చేసింది. అరవింద సమేత సినిమా రిలీజ్ అయిన రెండేళ్ల తర్వాత.. అది కూడా రికార్డు ధర పలికిన హిందీ వర్షన్ ఇప్పుడు టీవీల్లో టెలికాస్ట్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. టీవీలో టెలికాస్ట్ అయ్యాక అఫీషియల్ గా యూట్యూబ్ లోనూ రిలీజ్ చేస్తారట.
ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. అరవింద సమేతను కన్నడలోనూ డబ్ చేయనున్నారట. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు కన్నడలో డబ్ అయి విజయం సాధించాయి. దీంతో అరవింద సమేతను కూడా త్వరలోనే కన్నడలో డబ్ చేయబోతున్నారు. డబ్బింగ్ పనులు పూర్తి కాగానే టీవీలో టెలికాస్ట్ చేస్తారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ వచ్చే సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. కరోనా ఎఫెక్ట్ తో ఆ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్టు సమాచారం.