జంక్ ఫుడ్.. ఇది ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరి తలుచుకుంటే చాలు నోరు ఉరిపోతుంటుంది. అలాంటి ఈ ఫుడ్ తింటే అధిక లావు అవుతాం. లావు అయినా పర్లేదు.. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు చూద్దాంలే అనే నిర్లక్ష్యంతో ఎంతోమంది మంచి ఫుడ్ ని తినకుండా జంక్ ఫుడ్ ని తినడానికి ఇష్టపడుతుంటారు. ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆశ్చర్యం వేసినప్పటికీ ఎక్కువ సమస్యలు ఎదుర్కొనెది ఆడవాళ్లే. ఎందుకంటే జింక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల శరీరం ఉండాల్సిన రీతిలో ఉండకుండా దారుణమైన లావు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అడిలైడ్‌లోని రాబిన్సన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకలు జరిపిన పరిశోధన ప్రకారం జంక్ ఫుడ్ ఎక్కువ తినే మహిళల్లో సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసింది. అతిగా జంక్ ఫుడ్ తిని పళ్లు తక్కువగా తినేవారికి ఈ సమస్య వస్తుందని అంటున్నారు పరిశోధకులు.
జంక్ ఫుడ్ తినే మహిళలు కూడా గర్భం దాలుస్తారని కానీ చాలా ఆలస్యంగా ఆ ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాదు మద్యపానం, ధుమపానం వంటివి చేసిన సమస్యలు వస్తాయని అధ్యయనం చెప్తుంది. అందుకే ఆడపిల్లలు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు.