Kapata Nataka Suthradhari: డిఫరెంట్ కాన్సెప్ట్ తో సస్పెన్స్ డ్రిల్ అరిగా రూ పొందుతున్న సినిమా కపటనాటక సూత్రధారి.. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందూలాల్, మాస్టర్ బాబా ఆహీల్, అమిక్ష, సునీత, భానుచందర్ , రవి ప్రకాష్ , అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను క్రాంతి సైన తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ రిలీజ్ చేశారు..!!

ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన అశ్వినీదత్ ట్రైలర్ చాలా బాగుందని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రమ బ్యాంకు కారణంగా నా కూతురు పెళ్లి ఆగిపోయింది సార్.. బ్యాంకు కి పెళ్లి కి ఏంటి సంబంధం అంటూ సాగే ట్రైలర్.. శ్రమ బ్యాంక్ ఏకంగా 200 కిలోలు అంటే 99 కోట్ల రూపాయలు మోసం చేసింది అంటూ ఉత్కంఠను రేపే ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ పై మంచి బజ్ ఏర్పడింది..