ట్రెండింగ్

Karate Kalyani: యూట్యూబ్ స్టార్ ని రోడ్డుపై పరిగెత్తించి పరిగెత్తించి కొట్టిన కరాటే కళ్యాణి..!!

Share

Karate Kalyani: సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి అందరికీ సుపరిచితులే. చాలా సినిమాలలో కామెడీ పాత్రలలో మెప్పించింది. వ్యాంప్ తరహా పాత్రలకు పెట్టింది పేరు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదే సమయంలో సమాజంలో బయట అనేక వివాదాల అంశాలలో తన అభిప్రాయాలు చెబుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండే కరాటే కళ్యాణి.. తాజాగా ఒక యూట్యూబ్ స్టార్ నీ రోడ్డు పై పరిగెత్తించి పరిగెత్తించి మరి కోట్టింది. విషయంలోకి వెళితే యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి.

Karate Kalyani who ran and hit the YouTube star on the road

అయితే శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా అమ్మాయిలను టార్గెట్ చేసి ప్రాంక్ వీడియోస్ చేస్తున్నాడని.. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనట్లు తన దృష్టికి వచ్చిందని కరాటే కళ్యాణి అతని ప్రశ్నించడానికి యూసఫ్ గూడా కు వెళ్ళటం జరిగిందట. ఆ సమయంలో శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడని.. కరాటే కళ్యాణి ఆరోపించింది. మహిళలను కించపరుస్తూ అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరిస్తే సహించేది లేదని.. అవసరమైతే సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేసి ఎలాగైనా అడ్డుకుంటాను అని కరాటే కళ్యాణి స్పష్టం చేసింది. అయితే శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన వీడియో ని కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ లైవ్ వీడియో ద్వారా చిత్రీకరించటం జరిగింది.

ఈ వీడియోలో మొదటిగా కరాటే కళ్యాణి తరుపున ఉన్న ఒక మగ వ్యక్తి యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి పై చేయి చేసుకోవడం జరిగింది. ఆతర్వాత కరాటే కళ్యాణి కూడా చేయి చేసుకుంది. ఇక సదరు యూట్యూబ్ స్టార్ట్.. తనపై దాడి చేసిన వ్యక్తిపై అదేవిధంగా కరాటే కళ్యాణి పై చేయి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే శ్రీకాంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. కరాటే కళ్యాణి యూసఫ్ గూడ బస్తీ వీధులలో.. శ్రీకాంత్ రెడ్డినీ పరిగెత్తించి.. పరిగెత్తించి మరి వెంటబడి దాడి చేయడం జరిగింది. ఈ మొత్తం ఘటన హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీలో జరగటంతో కరాటే కళ్యాణి ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కరాటే కళ్యాణి చెంప ఛెళ్లుమనిపించేలా యూట్యూబ్ సార్ శ్రీకాంత్ రెడ్డి కొట్టడం ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


Share

Related posts

Monsoon Diet: వర్షాకాలంలో ఇవి తింటే చాలు..!! ఏ వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టవు..!!

bharani jella

బిగ్ బాస్ 4 : ‘ ఇలా అయితే నా వల్ల కాదు ‘ అసహనంగా ఉన్న నాగార్జున ?

sekhar

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకున్న… సీజన్ ఫైవ్ ఎలిమినేట్ కంటెస్టెంట్..!!

sekhar