Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం.. నిన్నటి 1052 వ ఎపిసోడ్ లో దీప గత పది సంవత్సరాల కల నిజం కానుంది.. కార్తీక్ అందరి ముందు దీప క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకుంటాడు.. ప్రస్తుతం ఆస్పటల్ లో ఉన్న దీపను కార్తీక్ దగ్గరుండి చూసుకుంటూ తనతో ప్రేమగా మాట్లాడుతాడు.. ఈ ఎపిసోడ్లో దీప, కార్తీక్ ల హైలెట్ సీన్స్ మేకింగ్ వీడియో ప్రేమి విశ్వనాథ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది..
Read More: Theeram: తీరం సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..
డాక్టర్ భారతి కార్తీక్ ని పిలిచి దీప స్పృహలోకి వచ్చింది. పిలిస్తే పలుకుతుంది అని చెప్పడంతో కార్తీక్ సంతోషానికి అవధులు లేవు.. కార్తీక్ వంటలక్క రూమ్ లోకి వెళ్లి దీప తలని నిమురుతూ 2 రోజులు ఆగు దీపా ప్రపంచంలో ఏ జంట ఇంత ఆనందంగా ఉండదు అనిపించేలా మనం ఉందాం అని మనసులో అనుకుంటాడు. దీప పక్కన కూర్చుని దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నా చదువు, సంస్కారం నేను ఎక్కడ పోగొట్టుకున్నాను నాకే తెలియదు. ఇన్ని రోజులుగా నిన్ను ఎంతో బాధ పెట్టాను. ఎంతో మందికి అన్నం పెట్టినా అన్నపూర్ణమ్మ చెయ్యి ఇది.. వంటలక్క అని ఈసడించుకున్నారు. నా పాపానికి పరిహారం లేదు. నీ కడుపున పుట్టిన నా పిల్లల పుట్టుకొని కూడా నేను అవమానించారు వీటన్నింటికి అందరి ముందు నీకు తలవంచి క్షమాపణ చెప్పాలి అంటూ చేతిని ముద్దాడుతూ, ఏడుస్తాడు.. ఆ స్పర్శకు దీప కళ్ళు తెరిచి చూస్తుంది.. ఈ సన్నివేశాలను చిత్రీకరించిన మేకింగ్ వీడియోలు ప్రేమి విశ్వనాథ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు..
కార్తీక దీపం మేకింగ్ వీడియో లింక్: