వంటలక్క సీరియల్ కథాకమామిషు

Share

ఏమోషనల్ ఎక్సైట్మెంట్…

తెలుగు సీరియళ్లలో ఇప్పుడు ప్రమోషన్… ఏమోషన్… డామినేషన్… ఎలివేషన్ ఈ నాలుగు అంశాలే లక్ష్యంగా జనంలోకి దూసుకొచ్చేస్తున్నాయ్. స్ట్రాంగ్ అప్పీల్ ఉన్న సీరియళ్లే సక్సెస్ అవుతుంటాయ్. కానీ కొన్ని సీరియళ్లు పకడ్బందీ స్క్రీన్ ప్లే, డైలాగులతో రక్తికడుతుంటాయ్. సీరియల్ ఏదైనా సరే… మొగడు, పెళ్లాం కొట్టుకోవడం, మధ్యలో కొడుకు… లవర్‎ని తీసుకురావడం లేదంటే ఒక వ్యాంపు రంగంలోకి దించడం… లేదంటే స్పెషల్ అట్రాక్షన్ కోసం పోలీస్ ఆఫీసర్‎ని లేదంటే ఒక బలమైన నటినో, నటీమణినో తీసుకొచ్చేస్తారు మన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. తమిళ వాసనలు చాలా మటుకు తగ్గాక… తెలుగుదనాన్ని నింపే ప్రయత్నంలో మొదలైన సీరియళ్లు అనేకం ఇప్పుడు బుల్లితెరపై అద్భుతాలు సృష్టిస్తు్న్నాయ్.

telugu tv serials names
telugu tv serials names

నాలుగేళ్లైనా నడపాల్సిందే…

సీరియల్ ఆ రోజు షురూ అవుతుంది. అందరూ సరదగా… సంతోషంగా ఉంటారు. ఇంతలోనే ఓ విషాదం మొదలవుతుంది. అది కూడా అప్పటి వరకు ఒక ఊపు ఊపేసిన కేరెక్టర్ కష్టాల్లోకి నెట్టబడుతుంది. రెండు ఎమోషనల్ డైలాగులు… రెండు కన్నీళ్లు… రెండు చెంప దెబ్బలు సీరియల్ పతాకస్థాయికి తీసుకెళ్లిపోతుంది. తెలుగులో ఇప్పటికే ఏళ్లతరబడి ఎన్నో సీరియళ్ల కొనసాగుతూనే ఉన్నాయ్. ఈ పరంపర ఇప్పుడు మొదలైంది కాదు… సహజసిద్ధంగానే సాగుతోంది. జనాలకు కూడా అప్పుడే తేల్చేయడమంటే నచ్చడం లేదన్నది మన నిర్మాతల ఫిలాసఫీ. మంచి డ్రామా ఉన్న సీరియల్, టీఆర్పీ బాగా వస్తున్న సీరియల్‎ని నాలుగేళ్లన్నా నడపాలి కదా అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పేస్తారు. ఈ ధోరణే ఇప్పుడు తెలుగు సీరియళ్లకు కాసులు కురిపిస్తున్నాయ్. నిర్మాతలకు లక్షలకు… లక్షలు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయ్.

Karuthamuthu malayalam still
Karuthamuthu malayalam still

మొదలై మూడేళ్లయ్యింది

తెలుగు తెరపై ఏళ్ల తరబడి వస్తున్న సీరియళ్లలో ప్రధాన అంశం ఫ్యామిలీ ఏమోషన్… భార్యా భర్తలు విడిపోవడం… అందుకు కారణాలన్నట్టుగా సాగుతుంటాయ్… మాటీవీలో సాగుతున్న కార్తీక దీపం మూడేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఐనప్పటికీ బలమైన స్ట్రాంగ్ స్టోరీతో రోజూ సీరియల్ రక్తికడుతూనే ఉంది. చిన్న పిల్లలు సైతం ఈ సీరియల్లో పెద్దలతో పోటీ పడి మరి డైలాగులు చెబుతుంటారు. అదుర్స్ అంటూ జనం ఇలలు వేస్తారు. ఇక మహిళలు భలే మాట్లాడావ్ అంటూ సంభరపడిపోతుంటారు. తమ ఇంట్లో సంఘటనతో… తమ చుట్టూ జరిగిన ఘటనగానో జనం చూస్తారు. కార్తీక దీపం సీరియల్ స్టార్ నెట్ వర్క్ యాప్ లో హాట్ స్టార్ లో ఉదయానే అందుబాటులో ఉన్నప్పటికీ టీవీలో చూడటానికే జనం ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. అంటే సీరియల్ కు రేటింగ్… చానెల్‎కి కాసులు కురిపిస్తుందన్నమాట.

 

karthika deepam in different languages
karthika deepam in different languages

మళయాలంలో మొదలు

అసలీ కార్తీక దీపం సీరియల్ ఎక్కడ నుంచి ఇక్కడకు ట్రాన్స్‎ఫర్ అయ్యిందో తెలుసుకోవాలి. ఇంతటి బలమైన కంటెంట్ అసలు మొదలు ఎవరు ప్రారంభించారన్నది కూడా విశేషమే. కార్తీక దీపం తొలుత దక్షిణాదిలోనే ఆరంభమయ్యింది. అది కూడా మన పొరుగు రాష్ట్రమైన కేరళలో. కార్తీక దీపం సీరియల్ తొలుత మళయాలీలో ప్రారంభమయ్యింది. కరుతముత్తు, (నల్లటి ముత్యం) పేరుతో సీరియల్ ఐదేళ్ల పాటు సాగింది. మళయాలంలో ఒక ఊపు ఊపేసింది. 2014, 20 అక్టోబర్‎న ప్రారంభమై 9 ఆగస్టు 2019న ముగిసింది. మళయాలంలో అతి పెద్ద రెండో సీరియల్‎గా ఇది రికార్డు సృష్టించింది. ఈ సీరియళ్లోనూ దీప పాత్రను కేరళ నటి ప్రేమి విశ్వనాథ్ పోషించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సీరియల్ మొత్తం 1450 ఎపిసోడ్లు సాగింది.

Kartik Purnima hindi
Kartik Purnima hindi

తెలుగులో సూపర్ డూపర్ హిట్

కరుతముత్తు సీరియల్ మళయాలంలో మొదలై మూడేళ్లైన తర్వాత తెలుగులో కార్తీక దీపంగా… మాటీవీలో ప్రారంభమైంది. తెలుగులో సీరియల్ మొదలై మూడేళ్లు కావొస్తున్నా నేటికి సన్సేషనల్‎గా సాగుతోంది. అర్ధగంటలో 16 టీఆర్పీ పాయింట్లను తెస్తూ చానెల్ నెంబర్ 1 పొజిషన్లో కొనసాగడానికి కారణమవుతోంది. 2017 అక్టోబర్ 16న ప్రారంభమై… 800 ఎపిసోడ్లు దాటడమే కాకుండా విజయవంతంగా సాగుతోంది. మళయాళంలో ఇదే దీప కేరెక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్ తెలుగులోనూ అదే పాత్ర పోషించడం విశేషం. తెలుగులో అత్యంత పాపులర్ ఉన్న సీరియల్ ఏదంటే టక్కున ఎవరైనా కార్తీక దీపం అని చెప్పేస్తారు. ఎందుకంటే సీరియల్ కంటెంట్‎లో అంత డెప్త్ ఉంది మరి.

karthika deepam telugu serial
karthika deepam telugu serial

ఆరు భాషాల్లో కార్తీక దీపం

మళయాలం, తెలుగులో కార్తీక దీపం సీరియల్ విజయవంతం కావడంతో దేశంలోని అనేక భాషల్లో నిర్మాణం మొదలుపెట్టింది స్టార్ యాజమాన్యం. కన్నడంలో 22 జనవరి 2018న ముద్దు లక్ష్మి పేరుతో స్టార్ సువర్ణలో ప్రారంభమైంది. అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక తమిళంలో భారతి కన్నమ్మ పేరుతో స్టార్ విజయ్‎లో 25 ఫిబ్రవరి 2019 నుంచి షురూ చేశారు. మరాఠిలోనూ 30 అక్టోబర్ 2019లో మొదవలగా… ఇక హిందీలో ఈ ఏడాది ఫిబ్రవరి 3 నుంచి కార్తీక పూర్ణిమ పేరుతో మొదలయ్యింది. మొత్తంగా ఆరు భాషల్లో ఈ సీరియల్ నిర్మాణం జరుపుకోవడమంటే ఆషామాషీ కాదు.. మళయాలంలో తప్పించి… అన్ని భాషల్లోనూ స్టార్ నెట్ వర్క్ ఆధ్వర్యంలోనే సీరియల్ నిర్మాణం సాగుతోంది.


Share

Related posts

ఆరోగ్యం పైన పీడకలల ప్రభావం.. ఎలా అంటే?

Teja

Rashmika Mandana: సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ ..!!

sekhar

ఐపీఎల్ : ఢిల్లీ హాండ్స్అప్ : ముంబై 5వ సారి

Special Bureau