జీవితంలో అదృష్టం ఎవరికి ఎలా వస్తుందో.. ఎలా వెళ్తుందో ఎవరికీ తెలియదు. అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. అయితే ఆ అవకాశాన్ని సరైన మార్గంలో వినియోగించుకున్న వారు విజయపథం వైపు నడుస్తూ వెళ్తారు. మరికొందరు చెడు మార్గాన్ని ఎంచుకొని ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ రెండో రకానికి చెందిన వాడు సుశీల్ కుమార్. బీహార్ ప్రాంతానికి చెందిన సుశీల్ కుమార్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ యాంకర్ గా చేసిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో అవకాశం దక్కించుకుని, అన్నిరౌండ్ల లో ఎంతో విజయవంతంగా ఆడి అక్షరాల ఐదు కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు.
ఒక్కసారిగా తన జీవితం ఎంతో కీలక మలుపు తిరిగింది. సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ దాకా ఎదిగాడు. అప్పటి వరకు ఎవరికీ తెలియని సుశీల్ కుమార్, ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. కానీ ఐదేళ్లలో ఐదు కోట్లు పోగొట్టుకొని తిరిగి తన సాధారణ జీవితం లో స్థిరపడ్డాడు.. సుశీల్ కుమార్ 2011లో కౌన్ బనేగా కరోడ్ పతి రియాల్టీ షో ద్వారా 5 కోట్ల రూపాయలు సంపాదించుకొని, ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అతడు ఎక్కడికెళ్లినా ఫోటోలు, ఆటోగ్రాఫ్ అంటూ పెద్ద ఎత్తున జనం వెంటపడేవారు. అంతేకాకుండా మీడియా ఇంటర్వ్యూ, వాణిజ్య కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాడు.
అతని జీవితం ఊహించని రీతిలో కి కాలం తీసుకెళ్ళింది. అదృష్టం అతనిలో ఎన్నో మార్పులు కూడా తీసుకువచ్చింది. నెలలో దాదాపు 15 ప్రైవేట్ పార్టీలలో పాల్గొనేవాడు. అడిగిన వారికల్లా డబ్బు దానం చేసేవాడు. అప్పటి వరకు సాధారణ జీవితం బతికిన సుశీల్ ఊహల్లో తేలిపోయాడు. డబ్బులు వృధా గా వస్తే వాటి విలువ తెలీదు అన్న మాటలకు సుశీల్ ప్రాణం పోసాడు. ప్రతి నెల ఢిల్లీ ట్రిప్పు వెళ్లేవాడు అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు, సిగరెట్, మందు ఇలా జల్సాలకు అలవాటుపడి డబ్బు వృధాగా ఖర్చు చేసేవాడు.
సినిమాలకు కథలు రాస్తానని, ముంబై పయనమయ్యాడు. అక్కడ సెట్ కాకపోవడంతో, సినిమాలకు దర్శకత్వం చేయాలని ప్రయత్నించాడు. అలా అతను దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఇటు కుటుంబ కలహాలు భార్య భర్తల మధ్య గొడవలు మొదలై, ఆ గొడవల కాస్త విడాకుల వరకు వెళ్లాయి. అయితే పెద్దలు పంచాయతీ చేయడంతో సద్దుమణిగాయి. ఐదు సంవత్సరాలలో అతని దగ్గర ఉన్న ఐదు కోట్లు మంచు ముక్కల కరిగిపోయాయి. అప్పుడు భుజం తట్టిన స్నేహితులు ఇప్పుడు ఎవరూ లేరు.
కుటుంబ పోషణ భారం కావడంతో చేసేది ఏమీ లేక నెలకు 18 వేల రూపాయల జీతం తీసుకుంటూ సాధారణ టీచర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మద్యం కూడా మానేశానని, తన జీవితంలో తనకు ఎదురైన అనుభవాలు అన్నింటిని ఫేస్ బుక్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నారు. అదృష్టం కలిసి వచ్చి నప్పుడు దానిని సక్రమైన మార్గంలో వినియోగించుకో కపోతే… ఏమవుతుందో చెప్పడానికి సుశీల్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ…