ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్ ఇంకో వరం… ఔను హుజురాబాద్ కోస‌మే!

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇటీవ‌లే ప్ర‌తిష్టాత్మ‌కంగా ద‌ళిత‌బంధును ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్ అనంత‌రం బీసీల కోసం సైతం ఓ స్కీం ప్ర‌వేశ‌పెట్టారు. తాజాగా ఇంకో తీపిక‌బురు తెలిపారు. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్ల‌కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను ఆదేశించారు.

Read More: KCR: కేసీఆర్ ఇంకో వ‌రాల జ‌ల్లు… ఈసారి బీసీల వంతు.

 

కేసీఆర్ ఏం చేశారంటే..
సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశం పై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో మంగళవారం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయస్సుపెంపు నిర్ణయం తీసుకున్నారు సీఎం. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనుంది.

Read More: KCR: ఈట‌ల ఇలాకా నుంచి ఆ స్కీం ఆవిష్క‌రించి కొత్త గేమ్ మొద‌లుపెడుతున్న కేసీఆర్‌!

హుజురాబాద్ కోస‌మేనా?

కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వెనుక అస‌లు కార‌ణం త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే హుజురాబాద్ ఉప ఎన్నికేనా? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్ల‌లో సింగరేణి కార్మికులు సైతం ఉన్నారు. అంతేకాకుండా వీరి కుటుంబాలు సైతం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కోల్ బెల్ట్ ఓట్లు కోల్పోకుండా ఉండాల‌ని సీఎం కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప‌లువురు అంటున్నారు.


Share

Related posts

Mahesh : మహేష్ సర్కారు వారి పాట మళ్ళీ దుబాయ్‌కా.. అప్పుడే రీ షూటా..?

GRK

Bigg Boss Telugu OTT: ఏంటి బిగ్ బాస్ నాన్ స్టాప్ కోసం నాగార్జున అంతా తీసుకున్నాడా .. వామ్మో !

sekhar

‘జగన్ అంటే గుర్తుకు వచ్చేది అదే’

Mahesh