KCR: కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన కాంగ్రెస్ పెద్దాయ‌న‌

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అవాక్క‌య్యే ప‌రిణామం ఇది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితబంధు పథకంపై ఊహించ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి దళితబంధు మంచి కార్యక్రమం అని ప్ర‌శంసించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ కాంగ్రెస్ ముఖ్య నేత ఎందుకు ప్ర‌శంస‌లు కురిపించారంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Read More : KCR: టీఆర్ఎస్ నేత‌ల‌కు అదిరిపోయే షాకిచ్చిన కేసీఆర్‌

జీవ‌న్‌రెడ్డి ఏమంటున్నారంటే…
రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు ని అర్హులైన వారికి అందించాలని భావిస్తోంది ప్రభుత్వం. హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి తేదీలను ఖరారు చేయనుంది. ఇప్పటికే ఎంత మంది అర్హులున్నారు? దళితవాడల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అనే దానిపై అధికారులు పూర్తిస్థాయిలో లెక్కలు సేకరించారు. ఈ ప‌థ‌కంపై తాజాగా జీవ‌న్ రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ మాట తప్పే వ్యక్తి కాదంటూ.. అన్నీ ఆలోచించిన తర్వాతనే సీఎం కేసీఆర్ మాట్లాడుతారని సీఎం పై జీవన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన అభినంద‌నీయ‌మ‌ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Read More : KCR: గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కేసీఆర్‌కు ఇచ్చిన స‌ల‌హా ఏంటో తెలుసా?


కేబినెట్‌లో కీల‌క చ‌ర్చ…
కాగా, తాజ‌గా జ‌రుగుతున్న కేబినేట్ స‌మావేశంలో ద‌ళిత‌బంధు గురించి ముఖ్య‌మైన నిర్ణ‌యాలు వెల్ల‌డి కానున్నాయి. ద‌ళిత బంధు అమ‌లు గురించి స‌వివ‌రంగా ఇందులో చ‌ర్చించ‌నున్నారు. దళిత బీమా, చేనేత బీమాలపై కూడా ఈ కేబినేట్
సమావేశంలో చర్చించనున్నారు. హుజూరాబాద్‌ అభివృద్ధిపైనా మంత్రివర్గం సమీక్షించనుందని తెలుస్తోంది. మొత్తంగా ఉప ఎన్నిక‌కు ముందు మంత్రిమండలి భేటీ కానుండటం ఆసక్తి కలిగిస్తోంది.


Share

Related posts

పాపం బండ్ల గ‌ణేష్… ఎంత కామెడీ అయిపోతున్నాడో….

sridhar

Rahul Dravid : క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కత్రినా కైఫ్..!!

sekhar

పేక మేడలా కుప్పకూలబోతున్న నేషనల్ కాంగ్రెస్ : సోనియా టెన్షన్ టెన్షన్ ! 

sridhar