KCR: కేసీఆర్ మ‌రిన్ని వ‌రాలు… నేడే ప్ర‌క‌ట‌న‌

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు వ‌రాల వాన కురిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. నేడు హుజురాబాద్‌లో జ‌ర‌గ‌నున్న స‌భ‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని స‌మాచారం. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం గోల్కండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం అని సీఎం కేసీఆర్ అన్నారు. దళితజాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు, ఆ వర్గం పై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తోంద‌న్నారు.

Read More: KCR: ద‌ళిత‌బంధు కేసీఆర్ కు బెడిసికొడుతోందా?

చ‌రిత్ర చెప్పిన కేసీఆర్‌….
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటే అలుముకొని ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం అంగీకరించి తీరాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణా ఏర్పడిన నాటినుండీ అణగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులువేసిందని చెప్పారు. దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపించిందని తెలిపారు. 2014 తెలంగాణా ఏర్పడేనాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య కేవలం 134 మాత్రమే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా 104 స్కూళ్ళు ఏర్పాటు చేసిందన్నారు. ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 238కి పెరిగిందని.. ఈ ఏడేళ్ల‌లో ఎస్, సి మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు.

Read More: KCR: కేసీఆర్ మ‌నిషిని బుక్ చేస్తున్న బీజేపీ

నేడే హుజురాబాద్‌లో …
ఒక ఆర్థిక సంవత్సరం లో SC ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా 20 లక్షల రూపాయల అత్యధిక మొత్తాన్ని స్కాలర్ షిప్ గా అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం అన్నారు. కాగా, నేడు హుజురాబాద్ లో జ‌రిగే టూర్లో సీఎం కేసీఆర్ మ‌రిన్ని వ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.


Share

Related posts

తన ‘ గుండు ‘ వెనక కథ గురించి సుధాకర్ ఏమన్నాడో చూడండి ! 

sekhar

గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి:నిర్ధారించిన డబ్ల్యు హెచ్ ఒ

somaraju sharma

Chandra Babu Naidu: వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ చంద్రబాబు సీరియస్ కామెంట్స్

somaraju sharma