Kegel Exercise: సాధారణంగా మహిళల్లో డెలివరీ తర్వాత మూత్రశయ సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా మాత్రం లీక్ అవ్వడం ఎక్కువమందిలో ఉండే సమస్య.. మూత్రాశయ కండరాలు వదులవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం.. గట్టిగా నవ్వాలన్నా, తుమ్మలన్నా, దగ్గాలన్న మూత్రం ఎక్కడ లీక్ అవుతుందో అన్న భయం వెంటాడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.. ఈ సమస్యకు కెగెల్ వ్యాయామం చక్కటి పరిష్కారం..!! ఈ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా ఈ ఆసనం వేసే ముందు మూత్ర విసర్జన చేయాలి. ఆ తరవాత శవాసనం వేసి ఒక నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి.. ఇప్పుడు చేతులను నెలకు అనించి కాళ్ళను మోకాలు దగ్గరకు మడిచి నెలకు అనించాలి. ఇప్పుడు మెల్లగా నడుము భాగాన్ని పైకి లేపి మెల్లగా పాదాలను నేలకు బిగించాలి. ఇందు వలన నడుము ఎక్కువసేపు పైకి ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉండి 10 నెంబర్లు లెక్కపెట్టి నిదానంగా నడుము భాగాన్ని కిందకు వంచుతూ రిలాక్స్ అవ్వాలి.. ఇలా మూడు పుట్లా చేయాలి. ఆసనం వేయడం అలవాటైన తరువాత క్రమంగా 20 సార్లు 30 సార్లు పెంచుకుంటూ వెళ్లాలి. ఈ ఆసనం వేయడం ద్వారా మూత్రాశయ కండరాలు బిగుతుగా తయారవుతాయి.. అంతేకాకుండా నడుము, పాదాలు, తొడలు పటిష్టంగా తయారవుతాయి.