NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Keto Diet: కీటో డైట్ పాటిస్తున్నారా..!? ముఖ్యంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!!

Keto Diet: అధిక బరువు తగ్గాలనుకునే వారు పాటిస్తున్న అనేక రకాల డైట్ లలో కీటో డైట్ కూడా ఒకటి.. ఇటీవల కాలంలో కీటో డైట్ బాగా ప్రాచుర్యం పొందింది.. చాలామంది ఈ డైట్ ను ఫాలో అవుతున్నారు.. ఈ డైట్ పాటించడం వలన కలిగే లాభాలు.. అలాగే ఈ డైట్ పాటిస్తే శరీరంలో జరిగే మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Keto Diet: Benefits And Disadvantages
Keto Diet Benefits And Disadvantages

Keto Diet: కీటో డైట్ పాటించాలంటే వీటికి సిద్ధంగా ఉన్నారా..!?

కీటో డైట్ లో మనం పిండి పదార్థాలను చాలా తక్కువగా తీసుకుంటాము. అందువలన మన శరీరం లో ఉన్న కొవ్వు తో పాటు మనం తీసుకునే కొవ్వు పదార్థాలను శక్తిగా తయారు చేసుకుంటుంది. దీనివలన త్వరగా కొవ్వు కరిగిపోతుంది. మన శరీరం కిటో దశ లోకి ప్రవేశించే ఈ సమయంలో మనకు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని కిటో ఫ్లూ అంటారు.. అలసట, నీరసం, మైకం, శక్తి తగ్గడం, జీర్ణ వ్యవస్థ లో ఇబ్బంది, మూర్చ అనుభూతి కలగడం, హృదయస్పందన లో మార్పులు వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి..

Keto Diet: Benefits And Disadvantages
Keto Diet Benefits And Disadvantages

కీటో డైట్ లో కి పూర్తిగా వెళ్లాక మన శరీరంలో నీటి శాతం బాగా తగ్గుతుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కోల్పోవడం వలన బరువు కూడా తగ్గుతారు. మన శరీరం డీహైడ్రేషన్ సమస్య కు గురవుతుంది అలాగే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దప్పిక ఎక్కువగా ఉంటుంది. తల తిరగటం, తలనొప్పి, కండరాల నొప్పులు, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరం కీటో దశలోకి ప్రవేశించినప్పుడు నోట్లో నుంచి పండ్ల లాంటి వాసన వస్తుంది.

Keto Diet: Benefits And Disadvantages
Keto Diet Benefits And Disadvantages

కొంతమందికి నెయిల్ పాలిష్ రిమూవ్ అలాంటి వాసన వస్తుంది. ఈ డైట్ పాటించడం వలన కాల్షియం తగ్గిపోయి, ఎముకల సాంద్రత కోల్పోతారు. ఎముకలు త్వరగా పెలుసు బారిపోతాయి. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇందుకోసం ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. మహిళల్లో రుతు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పీరియడ్స్ లేటుగా వస్తాయి. ఈ సమస్యలను ఎదుర్కొంటాము అనుకుంటేనే ఎవరైనా కీటో డైట్ ప్రారంభించడం ఉత్తమం. కీటో డైట్ ను డాక్టర్ పర్యవేక్షణలో జరిగితేనే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి.

Keto Diet: Benefits And Disadvantages
Keto Diet Benefits And Disadvantages

Keto Diet: కీటో డైట్ పాటిస్తే కలిగే లాభాలివే..!!

బరువు తగ్గడానికి ఈ డైట్ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ డయాబెటిస్ వారిలో ఇన్సులిన్ పెంచేందుకు సహాయపడుతుంది. కీటో డైట్ దీర్ఘ కాలంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే మీ శరీరం ఏ మేరకు కీటో డైట్ కు అనుగుణంగా రియాక్ట్ అవుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ నియంత్రణ కు కీటో డైట్ అద్భుతంగా సహాయపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!