ట్రెండింగ్ న్యూస్ సినిమా

SR Kalyanamandapam: కిరణ్ అబ్బవరం బర్త్డే స్పెషల్.. ఎస్ఆర్ కళ్యాణమండపం టీజర్ విడుదల..!!

Share

SR Kalyanamandapam: రాజావారు రాణిగారు సినిమా హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం.. ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపుని సంపాదించుకుని వరుస సినిమా ఆఫర్లను అందుకున్నాడు.. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం.. నేడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు..!! ఈ సందర్భంగా ఎస్ఆర్ కళ్యాణమండపం నుంచి  స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు..!!

Kiran Abbavaram birthday special SR Kalyanamandapam: teaser out
Kiran Abbavaram birthday special SR Kalyanamandapam: teaser out

తాజాగా విడుదలైన బర్త్డే టీజర్ లో కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో తెలియజేస్తోంది..  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడంతో పాటు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్ ప్లే, డైలాగ్స్ కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రమోద్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీధర్ గాదే ఎస్ ఆర్ కళ్యాణమండపం EST 1975 తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. ఈ చిత్రంలో విలక్షణ నటుడు, డైలాగ్ సాయి కుమార్ హీరో తండ్రిగా నటిస్తున్నారు. తనికెళ్ల, భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.. ఆగస్టు 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది..

 


Share

Related posts

Prabhas Salaar : లీక్ అయిన ప్రభాస్ సలార్ స్టోరీ : అబ్బబ్బ మామూలుగా లేదు – ముంబై మాఫియా డాన్ గా ప్రభాస్ ?

siddhu

Tamilnadu elections : మళ్లీ బరిలోకి చిన్నమ్మ?

siddhu

నిమ్మగడ్డ స్థానే మన్మోహన్… జగన్ లాజిక్ ఇదే?

CMR