SR Kalyanamandapam: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం..!! ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ గాడి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టిన వాడు కూడా మనకు విలువ ఇవ్వడా.. అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. ఏంట్రా అబ్బయ్యా చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టూ తిరిగేటోడు.. నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకా యాడ నిద్రపట్టి చచ్చేది కాదు.. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బయ.. నాతో మాట్లాడడం మానేసాడు.. ఇట్లాంటి నా కొడుకు ఎవరికీ పుట్టి సావద్దు..
వీడికి నాకే పడదు అనుకున్నాను మీకు కూడా పడదా.. వరస్ట్ సన్ ఫర్ గ్రేడ్ ఫాదర్.. లక్షలు లక్షలు డొనేషన్ కట్టి కాలేజ్ ఫీజ్ కడితే చదువుతూ నేర్పుతరేమో.. సంస్కారం మాత్రం కొంపలోనే నేర్పాలి. నేర్పు వాడికి కొంచెం.. డబ్బులుది ఏం ఉందిరా వస్తాయి పోతాయి.. మనం బ్రతికే బ్రతుకే కదా ముఖ్యం.. నేను ఎంత పోగొట్టిన ఎవరిదీ తినలా.. అది ఎలా చెప్పాలిరా వీడికి.. అంకుల్ ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచేమో నేను మీకు బాగా కావాల్సిన వాడిని.. అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది.. రాయలసీమ యాసలో సాయి కుమార్ చెప్పిన డైలాగులు అందర్నీ ఆకట్టుకున్నాయి. కిరణ్ అబ్బవరం యాక్షన్ హైలెట్ గా నిలిచింది.. ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ ఏంటో అర్థమవుతోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 6న ఈ సినిమా విడుదల కానుంది..