NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

చిరంజీవి ‘ఆచార్య’ పై కోర్టుకి వెళ్ళనున్న దర్శకుడు కొరటాల..! నష్టం ఎవరికి?

మెగాస్టార్ చిరంజీవి-స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ‘ఆచార్య’ చిత్రం మూవీ మోషన్ పోస్టర్ విడుదలైన తర్వాత రాజేష్ మండూరి అనే వర్ధమాన రచయిత ఈ మూవీ స్టోరీ తనదే అంటూ ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చాడు.

 

Koratala Siva - Wikipedia

రెండేళ్ల క్రితం తాను రాసుకున్న ‘పెద్దాయన’ కథని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు వినిపించానని…. అప్పుడు ఆయన చెప్పిన కథను ఇప్పుడు మలిచి మైత్రి మూవీస్ తో స్నేహంగా ఉండే కొరటాల శివ ‘ఆచార్య; సినిమాను మెగాస్టార్ హీరోగా పెట్టి తెరకెక్కిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పెద్ద దుమారం లేచింది. పలువురు ఇండస్ట్రీ పెద్దలను కలిశానని…. తెలుగు రచయితల సంఘానికి కంప్లైంట్ చేశానని…. కానీ వారంతా పక్షపాతంగా వ్యవహరిస్తూ లీగల్ గా వెళ్లాలని అతనికి సలహా ఇచ్చారని పేర్కొన్నారు. 

అయితే ఈ వివాదంపై స్పందించిన ఆచార్య మూవీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, దర్శకుడు కొరటాల శివ రాజేష్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. స్వయంగా రాజేష్ మండూరితో న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో మాట్లాడిన శివ కొరటాల…. ఆచార్య స్టోరీ మీరు చెబుతున్నది కాదని…. మీరు మీ కథతో సినిమా తీసుకోవచ్చని కూడా చెప్పారు. అయితే రాజేష్ మాటలకు బాగా అసహనానికి లోనైన కొరటాల చివరికి ఈ విషయంపైన కోర్టుకు వెళతాం అని అన్నాడు. 

‘ఆచార్య’ కథ వివాదం పై కొరటాల శివ లీగల్ గా ముందుకుపోవాలని నిర్ణయించుకొని ప్రస్తుతం రాజేష్ తనపై చేసిన ఆరోపణలకు పరువునష్టం కేసు వేసినట్లు తెలుస్తోంది. స్వతహాగా లాయర్ అయిన ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్రెడ్డి దీనికి సంబంధించిన పత్రాలు సిద్ధం చేసి కోర్టుకు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల గత చిత్రాలైన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాల విషయంలో కూడా ఇలా కథపై కాపీరైట్స్ వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. 

రాజేష్ కూడా ఇప్పటివరకు ఈ విషయంపై తనకు ఎటువంటి సహకారం అందకపోవడంతో లీగల్ గా వెళ్లాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. మరి ‘ఆచార్య’ కాపీ వివాదానికి న్యాయస్థానం దగ్గరైనా ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఇక దీని వల్ల రాజేష్ ఏమైనా నష్టపోతాడా లేదా న్యాయస్థానం వద్ద ఏమైనా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చి చిరు చిత్రానికి ఇబ్బంది కలుగుతుందా అన్నది వేచి చూడాలి.

author avatar
arun kanna

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?