ట్రెండింగ్ న్యూస్

Krishnapatnam Aanandayya: ఆనందయ్య మందు పరిశోధనా బాధ్యతలు వీరికి అప్పగించిన సీసీఆర్ఏఎస్

Share

Krishnapatnam Aanandayya: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో బోరిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనా కు విరుగుడు కానుందా.. 16 మూలికలతో తయారు చేస్తున్న ఈ ఆయుర్వేద మందులు కళ్ళల్లో వేస్తున్నారు.. అయితే ఇప్పటి వరకు ఈ మందు తీసుకున్న వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి.. ఈ మందు పనితీరుపై ఇప్పటికే పరిశోధన మొదలైంది.. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (సీసీఆర్ఏఎస్) నాలుగు భాగాలుగా ఈ ఆయుర్వేద మందును విశ్లేషించనుంది..!!

Krishnapatnam Aanandayya: ayurvedic medicine research start on CCRAS
Krishnapatnam Aanandayya: ayurvedic medicine research start on CCRAS

మొదటి దశలో ఈ మందు తీసుకున్న వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి సీసీఆర్ఏఎస్ బాధ్యతలు అప్పగించింది.. ఇప్పటివరకు మందు తీసుకున్న 500 మంది ఫోన్ నెంబర్లను పోలీసులు సేకరించారు. వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. సీసీఆర్ఏఎస్ ప్రొఫార్మా ప్రకారం సహకరించిన వివరాలను పొందుపరచనున్నారు. మరో రెండు రోజుల్లో ఈ వివరాల సేకరణ పూర్తి చేయనుంది. మొదటి దశ పరిశోధనలు పూర్తి కావడానికి 4-5 వారాల సమయం పడుతుందని వైద్య అధికారులు తెలిపారు. ఈ నాలుగు దశలు పరీక్షలు నిర్వహించిన తర్వాత తుది రిజల్ట్ ను సీసీఆర్ఏఎస్ వెల్లడిస్తుంది.


Share

Related posts

రెండో టెస్ట్ కు ముందు భారత్ కు షాక్

Siva Prasad

Butterfly Asana: ఈ ఆసనం వేస్తే త్వరగా బరువు తగ్గుతారు..!! 

bharani jella

కాసేపట్లో కొత్త మంత్రి వర్గం.. పాత మంత్రికి భారీ ట్విస్ట్?

CMR