NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

అయ్య బాబోయ్ ఇదేంది..! పార్ల‌‌మెంట్‌లోనే పంది, గొడ్డు మాంసం కోసం కొట్టుకున్న ఎంపీలు.. ఎక్క‌డో తెలుసా?

పంది, గొడ్డు మాంసం కోసం ఏకంగా ఎంపీలే కొట్టుకున్నారు. అది కూడా పార్ల‌మెంట్‌లో. ఎంపీలు త‌న్నులు, పోట్లాట‌ల‌తో పార్ల‌మెంటే ర‌ణస్థ‌లంగా మారిపోయింది. ఒక‌రిపై ఒక‌రు త‌న్నులు, పిడిగుద్దుల‌తో రెచ్చిపోయారు. పార్ల‌మెంట్ అనేది దేశ సార్వ‌భౌమాధికారానికి ప్ర‌తీక‌, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌నిచేసే చోటైన చ‌ట్ట‌స‌భ‌లు అనే విష‌యాన్ని మ‌రిచిపోయి ప్ర‌జా ప్ర‌తినిధులు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్న ఘ‌ట‌న తైవాన్ లో చోటుచేసుకుంది.

శుక్ర‌వారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లో కెళ్తే.. తైవాన్ పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా అగ్ర‌రాజ్యం అమెరికా నుంచి ఆ దేశానికి దిగుమ‌తి చేసుకుంటున్న పంది, గొడ్డు మాంసంపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వాడివేడి చ‌ర్చ జ‌రుగుతూ.. మాట‌ల యుద్ధానికి తెర‌లేసింది. చిలికిచిలికి గాలివాన‌లా చివ‌రికి ఆ మాటల యుద్ధం ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది.

ఈ క్ర‌మంలోనే అధికార పార్టీ నేత‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌లు ఒక‌రిపై ఒక‌రు మాంసం ముద్ద‌ల‌తో దాడిచేసుకున్నారు. త‌న్నులు, పిడిగుద్దుల‌తో రెచ్చిపోయారు. దీంతో ఒక్క‌సారిగా పార్ల‌మెంట్ అనే విష‌యాన్ని మ‌రిచిపోయిన ఎంపీలు ఆ ప్రాంతాన్ని ర‌ణ‌రంగంగా మార్చారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం అమెరికాతో తైవాన్ చేసుకున్న మాంసం దిగుమ‌తి ఒప్పంద‌మే కార‌ణంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఆగ‌స్టులో పంది మాంసం దిగుమ‌తిపై ఉన్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన దానికి సంబంధించిన వివ‌రాల‌ను ప్రీమియ‌ర్ సుసెంగ్ చాంగ్ పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు వివ‌రిస్తుండ‌గా.. దానిని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి.

కాగా, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డెమోక్ర‌టిక్ ప్రొగ్రెసివ్ పార్టీ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అమెరికా నుంచి వ‌చ్చే పంది మాంసం, గొడ్డు మాంసం దిగుమ‌తుల‌ను వ్య‌తిరేకించారు. అయితే, ప్ర‌స్తుతం దిగుమ‌తుల‌పై ఉన్న ఆంక్ష‌లు తొల‌గించ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్షాల‌తో పాటు అక్క‌డి ప్ర‌జ‌లు కూడా తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా అక్క‌డి ప్రజ‌లు ఆ దేశ రాజ‌ధాని తైపీలో భారీ నిర‌స‌న ర్యాలీలు కూడా నిర్వ‌హించారు. అయితే, వాణిజ్య ఒప్పందంలో భాగంగానే మాంసం దిగుమ‌తుల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నామ‌నీ, జ‌న‌వ‌రి నుంచి ఇది అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తైవాన్ ప్రభుత్వం ప్ర‌క‌టించింది.

Related posts

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N