ట్రెండింగ్

Indian Idol Telugu: లెజెండ్రీ సింగర్ ఎస్పీబి నీ తలుచుకొని కంటతడి పెట్టిన న్యాయనిర్ణేతలు..!!

Share

Indian Idol Telugu: “ఆహా” ఓటిటిలో తెలుగు ఇండియన్ ఐడిల్ తొలి సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. మంచి టాలెంట్ ఉన్న గాయకులు… రక రకాల పాటలతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ ఉంటారు. కొంతమంది యువ గాయకులు పాడుతున్న పాట తీరుకు న్యాయనిర్ణేతలు ప్రశంసిస్తూ అక్కడికక్కడే అవకాశాలు ఇస్తున్న సందర్భాలు కూడా ఈ షోలో జరిగాయి. దీంతో పోటీదారులు ఎవరికి వారు నువ్వానేనా అన్నట్టుగా.. తమ ప్రతిభను అద్భుత రీతిలో కనబరుస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల వారాంతపు ఎపిసోడ్ లలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి షోలో పాల్గొన్న న్యాయనిర్ణేతలు నివాళులర్పించారు.

ఈ ఎపిసోడ్ లో గాయని కల్పన ప్రత్యేక అతిథిగా హాజరు కావడం జరిగింది. ఇండస్ట్రీలో ఎస్పీ బాలసుబ్రమణ్యంతో యువ గాయకులలో అత్యధిక పాటలు పాడిన సింగర్ గా కల్పనా కి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ క్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కల్పన పాడిన పాటలు వీకెండ్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్  ఆలపించారు. ఇక ఇదే సమయంలో షోకి హోస్ట్ గా చేస్తున్న శ్రీ రామ్ చంద్ర ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం స్పెషల్ ఎపిసోడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇండియన్ ఐడిల్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంతగానో ప్రోత్సహించారని చెప్పాడు. అంతమాత్రమే కాదు ఓటు వేసి మరీ ఎంకరేజ్ చేశారు అనీ గుర్తు చేసుకున్నాడు.

Indian Idol Telugu: Judges, contestants pay glowing tributes to SP Balasubrahmanyam | Tv News – India TV

ఎస్పీ బాలసుబ్రమణ్యం స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా.. కొన్ని సందర్భాలలో కంటతడి పెట్టేంతగా   న్యాయనిర్ణేతలు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఇతర గాయకులతో వ్యవహరించే దాని గురించి.. ఇంకా ఆయన మాట్లాడే తీరు ఇలా అనేక విషయాల గురించి ఈ spb ఇండియన్ ఐడల్ తెలుగు స్పెషల్ ఎపిసోడ్ లో అనేక విషయాలు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందు జడ్జీలు ఎస్ తమన్, కార్తీక్, కల్పనా ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ 25 వ తారీకు మహమ్మారి కరోనా కారణంగా బాలసుబ్రహ్మణ్యం మరణించడం జరిగింది. బాల సుబ్రహ్మణ్యం మరణం తో భారతీయ చలన చిత్ర రంగ ప్రముఖులు ఎంతగానో బాధ పడరు. ఒక తెలుగులో మాత్రమే కాదు దేశంలో అనేక భాషలలో బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు. సినిమా పాటలు మాత్రమే కాదు వివిధ విశ్వాసాలకు చెందిన పాటలు కూడా బాలసుబ్రమణ్యం పాడటం విశేషం. ఇకపోతే ఇండియన్ ఐడిల్ తెలుగు షోలో ఇప్పటికే పది మంది కంటెస్టెంట్స్ టాప్ లో ఉన్నారు. ఈ వారంలో వీరిలో ఐదుగురు ఎలిమినేట్ కానున్నారు. ఓటిటీ “ఆహా”లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి భారీ రెస్పాన్స్ వస్తోంది.


Share

Related posts

కల్లు తాగుతూ గుడాలు తింటూ.. ఫ్రెండ్స్ తో రచ్చ.. సోహెల్ కథ వేరే ఉంటది మరి?

Varun G

Hotel Bill : ఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!!

bharani jella

Devatha Serial: కమలకు శ్రీమంతం చేసేది తన అక్క రుక్మిణీ అని తెలిసి ఏం చేసిందంటే..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar