Lemon Grass: ప్రకృతి లో ఎన్నో మొక్కలు.. వాటి వలన ఎన్నో ప్రయోజనాలు.. ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకొని దానిని ఉపయోగిస్తే వాటి ప్రయోజనాలు పొందడం సులువే.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి.. దీనిని లెమన్ గ్రాస్ అని కూడా అంటారు.. నిమ్మ చెట్టు ని నేరుగా తీసుకోవడం కంటే కూడా టీ గా తయారుచేసుకొని తాగితే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి.. లెమన్ గ్రాస్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ప్రతి ఒక్కరూ ఈ నీటిని కచ్చితంగా తాగుతారు.. లెమన్ గ్రాస్ టీ కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందామా..!!
Lemon Grass: లెమన్ గ్రాస్ టీ తయారు చేసుకునే విధానం..!!
కావలసిన పదార్థాలు :
నీళ్లు – 4 కప్పులు, సన్నగా తరిగిన లెమన్ గ్రాస్ కాడలు – రెండు కప్పులు, తేనె – పావు కప్పు.
ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని బాగా మరిగించాలి. తర్వాత అందులో లెమన్ గ్రాస్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మరిగాక ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి ఈ టీ లో తేనె కలుపుకుని వేడివేడిగా తాగాలి. తేనే వద్దు అనుకుంటే బెల్లం, పటిక బెల్లం ను కూడా ఉపయోగించవచ్చు. ఇలా తయారుచేసుకున్న టీ ని సేవించడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..
Lemon Grass: లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు..!!
నిమ్మగడ్డి లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యాధి కారక ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. శరీరంలో కి క్రిమి కీటకాలను దరిచేరనివ్వదు. దేహం ను రక్షిస్తుంది. నోటి లో ఇన్ఫెక్షన్లు రానివ్వదు. దంతక్షయానికి కారణం అయ్యే బ్యాక్టీరియా ను నివారిస్తుంది. లెమన్ గ్రాస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు లోని మంటను తగ్గిస్తాయి. ఈ టీ నీ ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కలిగిస్తుంది. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ టీని రోజూ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. అధిక రక్తపోటు తో బాధపడేవారు దీనిని తాగటం వలన బీపీ అదుపు లోకి వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి, ఇన్ఫెక్షన్స్, ఆందోళన, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, తలనొప్పి సమస్యలకు లెమన్ గ్రాస్ టీ చక్కగా పనిచేస్తుంది. ఈ టీ రోజు తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేసిన పరిశోధనలో నిరూపితమైంది. అందుకే ఈ టీ ను సర్వరోగ నివారిణిగా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే లెమన్ గ్రాస్ టీ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తాగండి. ఒక్కసారి దీని రుచి చూశాక అస్సలు వదలరు. .