Masked Aadhar: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ చర్చనీయాంశంగా మారింది. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఎవరికి ఇవ్వకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం పత్రికా ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో మాస్కడ్ ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వాలని సూచించింది. కొంతమంది ఆకతాయిలు ఆధార్ కార్డులను ఫోటోషాప్ చేసి దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే అనంతరం పత్రికా ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నట్లు వివరణ ఇస్తూ మాస్క్‌డ్ ఆధార్ పత్రికా ప్రకటన ఉపసంహరించుకుంది. అయితే ఇప్పుడు మాస్క్‌డ్ ఆధార్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలానో తెలుసుకొందాం.
1)మీరు మాస్క్‌డ్ ఆధార్ కార్డును పొందుకోవాలి అంటే. ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. https://myaadhaar.uidai.gov.in/ అనే వెబ్ సైట్ అడ్రస్ ద్వారా మీరు నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు.
2)అనంతరం లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, ఓటీపీ, క్యాప్చా వంటి ఎంటర్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
3)కొత్త పేజ్ లో మీకు డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు మాస్క్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
4)దీంతో మీ మాస్క్‌డ్ ఆధార్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేయాలంటే 8 అంకెల పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీ పేరుతో తొలి నాలుగు ఆక్షరాలు (క్యాపిటల్ లెటర్), పుట్టిన సంవత్సరం కలిపి పాస్‌వర్డ్‌గా సెట్ చేస్తారు.
5)ఆ తర్వాత పాస్‌వర్డ్ ఎంట్రీ చేయగానే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డు నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
లేదా
క్లుప్తంగా….మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోను విధానం
step1: మొదటిగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. myaadhaar.uidai.gov.inకి వెళ్లండి
step2: మాస్క్ చేసిన ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి..అనంతరం లాగిన్ ఆప్షన్ వస్తోంది.
లాగిన్ చేయండి. లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి
step3: తర్వాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
step4: క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి
step5: ఆపై, ‘OTP పంపు’పై క్లిక్ చేయండి
step6: OTP మీకు పంపబడుతుంది
ఆధార్ లింక్ చేయబడిన పది అంకెల మొబైల్ నంబర్
step7: అవసరమైన స్థలంలో OTPని నమోదు చేయండి
స్క్రీన్‌పై కనిపించే లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి
step8: ‘సర్వీసెస్’ విభాగానికి వెళ్లి, క్లిక్ చేయండి
‘ఆధార్‌ను డౌన్‌లోడ్ చేయండి’
step9: ‘మీ జనాభాను సమీక్షించండి’కి వెళ్లండి
డేటా విభాగం
step10: ‘మీకు మాస్క్‌డ్ ఆధార్ కావాలా?’
ఎంపికపై క్లిక్ చేసి, మాస్క్‌ను డౌన్‌లోడ్ చేయండి
మాస్క్‌డ్ ఆధార్. జారీ అయిన ఆధార్ కార్డు నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…
Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…