NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lotus Root: కమలం పూలతో కలిగే ప్రయోజనాలు తెలుసు..!! మరి కమలం వేర్లు చేసే మేలు గురించి తెలుసా..!!

Lotus Root: కమలం పుష్పం చూడడానికి అందంగా ఉంటుందని.. నీటిలో పెరుగుతుందని.. ఈ పూలతో దేవుడికి పూజ చేస్తారని.. జాతీయ పుష్పం కమలం అని అందరికీ తెలిసిందే.. మరికొంతమందికి తామర పువ్వులలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని, అనేక వ్యాధుల నివారణలో దీనిని ఉపయోగిస్తారని తెలుసు.. తామర పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండెజబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.. కమలం పువ్వుల రసం దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము ను తగ్గిస్తుంది. దీనిని ఆయుర్వేదంలో చర్మ వ్యాధులు, కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు..!! అయితే తామర వేర్లు తినవచ్చని ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.. కమలం వేర్లు మన డైట్ లో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులరు.. తామర వేర్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందామా..!!

Lotus Root: Health Benefits Amazing Results
Lotus Root Health Benefits Amazing Results

తామర పుష్పం పైకి కనిపించడానికి నీటి లో వాటి వేర్లు సహాయపడతాయి. ఇవి సుమారు నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇవి తినటానికి ఉపయోగ పడతాయని ఎక్కువ మందికి తెలియక పోవచ్చు కమలం వేళలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ బి, సి పుష్కలంగా ఉన్నాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తినటానికి కరకరలాడుతూ ఉంటాయి.. వీటిని కూరగా వండుకోవచ్చు. లేదంటే బంగళా దుంపల చిప్స్ లాగా తయారు చేసుకొని తినవచ్చు. సూప్ లా తయారు చేసుకొని తాగవచ్చు. ఏ విధంగా కూడా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Lotus Root: Health Benefits Amazing Results
Lotus Root Health Benefits Amazing Results

బరువు తగ్గడానికి ఇవి దోహదపడతాయి.. బరువు తగ్గాలన్నా ఒత్తిడి పోవాలన్నా ఈ వేర్లు తినాలి.. కొంతమంది తినకపోయినా చూడటానికి లావుగా కనిపిస్తారు. వారి బాడీలో లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కమలం వేర్లు తినటం వలన శరీరంలో ఉన్న నీటిని లాగేస్తుంది. ఇది శరీరంలో ఉన్న సోడియం బయటకు పంపిస్తుంది. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఇది కొంచెం తిన్నా కూడా ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఈ విధంగా కూడా బరువు తగ్గుతారు. ఈ వేర్లను కూరగా వండుకొని తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఈ వేర్లలో విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా లభిస్తుంది. దీనివలన టెన్షన్, ఒత్తిడి, తలనొప్పి, కంగారు వంటి సమస్యల నుంచి సులువుగా బయట పడేస్తుంది విటమిన్ బి కాంప్లెక్స్ బ్రెయిన్ కి చేరి దానిని శాంత పరుస్తుంది. ఒత్తిడి ని తగ్గిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ బీ, సీ లు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి. జుట్టుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. దేవి లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ వేర్లు ఎక్కువగా తీసుకోవడం వలన మలబద్ధకం ను నివారిస్తాయి. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ సమస్య లను తగ్గిస్తాయి.

Read More :

Kidney Stones: కిడ్నీలో రాళ్లకు తొందరపడి ఆపరేషన్ చేయించుకోండి..!! ఈ ఆకు రసాన్ని తాగండి చాలు..!!

Gastric Home Medicine: గ్యాస్, కడుపు మంట తగ్గుదలకి సులువైన చిట్కాలు ఇవి..!!

 

 

Fertility: ఎన్ని మందులు వాడినా పిల్లలు పుట్టడం లేదా..!? ఇది వాడి చూడండి.. వారం రోజుల్లోనే గర్భం వస్తుంది..!!

author avatar
bharani jella

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N