కొడుకంటే ప్రాణాలు తీసేంత ప్రేమ‌..! ఎందుకు? ఎక్క‌డో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రేమ ఎంత ప‌నిచేయ‌డానికైనా వెనుక‌డుగు వేయ‌కుండా చేస్తుంది. మ‌రీ ముఖ్యంగా పిల్ల‌ల‌పై త‌ల్లి దండ్రుల‌కు ఉండే ప్రేమ, ఇష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే వారు సంతోషంగా ఉండ‌టాకిని ఎంత‌టి క‌ష్టాన్నైనా భ‌రించ‌డంతో పాటు ఇత‌రుల‌కు ఏం చేయ‌డానికైనా వెనుక‌డుగు వేయ‌రు. ఇలా పిల్ల‌లపై ఉన్న‌ప్రేమ‌తో వారిని బాధించే వారిని కొట్ట‌డంతో పాటు ప‌లు ప్రాంతాల్లో ప్రాణాలు తీసిన ఘ‌ట‌న‌లు కూడా చాలానే వెలుగు చూశాయి ఇప్పటివరకు.

తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటుచేసుకుంది. కానీ, త‌న కుమారుడిపై అమిత‌మైన ప్రేమ పెంచుకున్న ఆ తండ్రి.. కొడుకు బాధ‌ల‌ను తీర్చ‌డానికి అత‌ని ప్రాణాలు తీశాడు. మీరు చ‌దివింది నిజ‌మే.. అతిగా ప్రేమించి.. త‌న కొడుకు ప్రాణాలు తీశాడు ఓ తండ్రి. ఇది మీకు షాకింగ్ గా అనిపించినా అక్క‌డ జ‌రిగింది ఇదే. త‌న కొడుకు భ‌విష్య‌త్తును గురించి ఎన్నో ర‌కాలుగా ఆలోచించిన ఓ తండ్రి.. మృగంలా మారి కొడుకు గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. దీనికి తోడు త‌న కుమారుడు బాధ‌లు ప‌డ‌కుండా విముక్తి క‌లిగించాన‌ని త‌న భార్య‌తో చెప్పుకొచ్చాడు.

ఈ షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కాన్పూర్‌లోని సీస‌మౌ ప్రాంతంలో నివాసం ఉంటున్న అలంకార్ శ్రీ‌వాస్త‌వా.. ఓ ప్ర‌యివేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. త‌న ముగ్గురు పిల్ల‌లు రుశాంక్ (10), గీతిక (10), తులిక (16)ల‌తో పాటు ఓ ప్రయివేటు పాఠ‌శాల‌లో ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న ఆయ‌న భార్య సారిక‌తో క‌లిసి ఆనందంగా జీవిస్తున్నాడు. అలంకార్‌కు పిల్ల‌లంటే చాలా ఇష్టం. వారి భ‌విష్య‌త్తును మంచిగా ఉండాల‌ని వారిక‌ల‌ల‌ను సాకారం చేయ‌ల‌నీ, దానికి త‌గిన‌ట్టుగా మెలిగేవాడు.

అయితే, క‌రోనా కార‌ణంగా ఇటీవ‌ల త‌న ఉద్యోగం కోల్పోయాడు అలంకార్‌. దీంతో తీవ్ర డిప్రెష‌న్‌లోకి వెళ్లిన అలంకార్… త‌న పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తును అందించ‌లేక‌పోతున్నాన‌ని కొన్ని రోజులుగా బాధ‌ప‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే అంద‌రూ నిద్రిస్తుండ‌గా.. త‌న‌తో ప‌డుకున్న కొడుకు గొంతు నులిమి చంపేశాడు. అత‌నిని బాధ‌ల నుంచి విముక్తి ల‌భించేలా చేశాన‌ని మార్నింగ్ భార్య‌తో చెప్పడంతో షాక్ గురైన ఆమె, వెంట‌నే బంధువుల‌కు ఈ ఘాతుకం గురించి తెలిపింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.