ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: తులసికి షాక్ ఇచ్చిన లక్కీ.. ప్రేమ్ గ్రేట్ అన్న తులసి.. నందు షాక్..

Share

Intinti Gruhalakshmi: మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతృ దినోత్సవం వేడుకలలో తులసి వాళ్ళు కూడా బెస్ట్ మదర్ కాంటెస్ట్ లో పాల్గొంటారు.. ఇక మూడో రౌండ్ కి చేరుకోగానే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారు.. తన తల్లి ఎందుకు గ్రేట్ అనే అంశం పై చెప్పవలసిన ప్రశ్న అందరికీ ఎదురవుతుంది.. దాంతో ప్రేమ్, దివ్య, అభి వాళ్ళ అమ్మ గురించి చాలా అద్భుతంగా చెబుతారు.. ఇక లక్కీ లాస్య గురించి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి..!

Lucky to shock Tulasi
Lucky to shock Tulasi

దివ్య నన్ను ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు మా నాన్న స్థానంలో మా అమ్మ ధైర్యంగా నిలబడి నన్ను రక్షించుకుంది.. అమ్మ కే సపోర్ట్ ఇవ్వని డాడ్ మాకేం సపోర్ట్ చేస్తారు.. అందుకే మా అమ్మ ఎప్పుడూ గ్రేట్ అంటూ దివ్య కన్నీళ్లు పెట్టుకుంది.. ప్రేమ్ మాట్లాడుతూ జన్మను, జీవితాన్ని ఇచ్చింది కూడా మా అమ్మే.. నేను ఒక పనికిరాని వాడిని అని నా తండ్రితో సహా.. అందరూ అంటుంటే మా అమ్మ మాత్రమే నన్ను నమ్మి ముందుకు నడిపించి.. మంచిగా తీర్చి దిద్ది అందుకే మై మామ్ ఇస్ గ్రేట్ అంటూ ప్రేమ్ చెబుతాడు.. నా ప్రేమ్ గ్రేట్ అని తులసి మనసులో అనుకుంటుంది.. నిన్ను దూరం చేసుకుని బాధ పడుతున్న అనుకుంటుంది మనసులో..

Lucky to shock Tulasi
Lucky to shock Tulasi

లాస్య కొడుకు లక్కీ మాట్లాడుతు.. మా మమ్మీ నా కోసం చాలా చేస్తుంది చేస్తూనే ఉంటుంది గోరుముద్దలు తినిపించడం ఓడిలో పడుకోబెట్టుకుని ఒక్క నిమిషం కూడా నన్ను వదలదు.. ఇవన్నీ నిజంగా కాదు కలలో.. ఏం తప్పు చేశానో.. తెలియదు మా మమ్మీ నన్ను హాస్టల్లో ఉంచి చదివిస్తుంది.. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు కానీ లోన్లీ గా ఉంటుంది.. హాస్టల్ రూమ్ జైల్ లా కనిపిస్తుంది మమ్మీ కనిపించదు.. ఏడుస్తూ ఉంటుంది చెప్పుకోడానికి ఎవరూ ఉండదు.. తినాలని ఉండదు నిద్రపట్టదు.. పారిపోవాలనిపిస్తుంది.. లాస్య మధ్యలో కల్పించుకుని వాడేదో తమాషాకి చెబుతున్నాడు అని అంటుంది.. లేదు మమ్మీ నిజంగానే చెబుతున్నాను అని లక్కీ అంటాడు.. నువ్వు కూడా నన్ను తులసి ఆంటీల ప్రేమగా చూసుకోవచ్చు కదా మమ్మీ అంటాడు లక్కీ.. నాకు అబద్ధం చెప్పడం చేతకాదు అందుకే నిజం చెప్పాను.. సారీ మమ్మీ.. ఎవ్వరికీ నాలాంటి లైఫ్ ఉండకూడదు అని చెప్పి లక్కీ తన స్పీచ్ ను ఆపేస్తాడు.. నాకు తెలుసు లక్కీ మాటలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేశాయని అంటారు..


Share

Related posts

YS Jagan: క‌రోనా క‌ల‌క‌లం … సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం?

sridhar

NTR30: కత్తి పట్టి వ‌స్తున్నా అంటున్న తార‌క్‌.. బ‌ర్త్‌డే ట్రీట్ అదిరిందంతే!

kavya N

After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయకూడదు.. ఎందుకో తెలుసా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar