Maha Political Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపులు.. అటు షిండే ..ఇటు ఉద్దవ్ కీలక ప్రకటనలు

Share

Maha Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొన్న శిందే.. త్వరలో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. తాము శివసేనలోనే ఉన్నామనీ, శివసేనను ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతోనే ఉన్నామన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు శిందే.. శిబిరంలో ఉన్న 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు.

Maha Political Crisis Uddhav Eknath key statements

Maha Political Crisis: ఢిల్లీలో బీజేపి అగ్రనేతలతో మాజీ సీఎం ఫడ్నవీస్ చర్చలు

కాగా రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై స్పందించేందుకు జూలై 12వ తేదీ వరకూ సుప్రీం కోర్టు గడువు పొడిగించిన నేపథ్యంలో అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.  ఏక్ నాథ్ శిందే తన తదుపరి వ్యూహంలో భాగంగా గవర్నర్ ను కలిసి ఠాక్రే సర్కార్ పై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై పావులు కదుపుతోంది బీజేపీ. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలోని పరిణామాలపై పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. నిన్న రాష్ట్ర నేతలతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి చర్చించిన ఫడ్నవీస్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

 

రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ

మరో పక్క శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. ముంబైకి తిరిగి వచ్చేయండి.. నాతో మాట్లాడండి. మనం ఒ పరిష్కారం కనుగొందాం. మీలో చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు అంటూ రెబల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా మీరు గోహాతిలో చిక్కుకుపోయారు. ప్రతి రోజు మీకు సంబంధించి కొత్త విషయం బయటికి వస్తొంది. మీరు ఇప్పటికీ శివసేన హృదయంలో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు నా వద్దకు వచ్చి తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. శివసేన కుటుంబ పెద్దగా చెబుతున్నాను. మీ మనోభావాలను గౌరవిస్తాను. ముందు మీరు అయోమయాన్ని వీడండి.. ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. కలిసి కూర్చుని చర్చించుకుందాం రండి. ఒకరి తప్పు కారణంగా మీరు ఉచ్చులో చిక్కుకోవద్దు. శివసేన ఇస్తున్న గౌరవం మీకు మరెక్కడా లభించద, మీరు ముందుకొచ్చి మాట్లాడితే ఒక మార్గం అంటూ ఏర్పడుతుంది. శివసేన కుటుంబ పెద్దగా మీ పట్ల ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాను వచ్చేయండి .. అందరం కలిసి ఆస్వాదిద్దాం అంటూ ఉద్దవ్ తన లేఖలో పేర్కొన్నారు.

 


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

46 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

55 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago