మహాతల్లి.. యూట్యూబర్ జాహ్నవి యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం అయినా సంగతి తెలిసిందే. తనని జాహ్నవి కన్నా మహాతల్లి అనగానే ఎంతో మందికి టక్ మని గుర్తొస్తుంది. అంతలా పాపులరైన మహాతల్లి ఎంతోమంది సబ్స్క్రైబ్ లను సంపాదించుకొని ఎంతో ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఆ జాహ్నవిని శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియో కాస్త నెట్టింటి రచ్చ రచ్చ చేస్తుంది.
స్టార్ యాంకర్ గా పేరు సంపాదించినా శ్రీముఖి నటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ 3 లో వచ్చి రన్నర్ గా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది ఈ భామ. అదుర్స్ అనే కార్యక్రమంతో యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టింది. 2012 సంవత్సరంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథా నాయికగా నటించింది.
పటాస్ షోకు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకొని కొన్ని కోట్లమంది అభిమానులను సొంతం చేసుకుంది శ్రీముఖి. ఇక అలాంటి శ్రీముఖి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ లో ”ఓహ్.. వుమెనియా” అనే టాక్ షోను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసినదే. ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి మహాతల్లి జాహ్నవితో కలిసి ఇద్దరు విచిత్ర డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
శ్రీముఖి అయితే భరతనాట్యం, కథకలి ఇలా పలు సాంప్రదాయమైన డాన్సులను చేస్తూ తన అభిమానులను ఎంతగానో అలరించింది. శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో ఎంతోమంది స్టార్ ఉమెన్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ మంచి ఫేమ్ సొంతం చేసుకుంటుంది. ఇక అలానే మహాతల్లిని ఇంటర్వ్యూ చెయ్యగా ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.