Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి ఫోటో లేదా చిన్నపాటి వీడియో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 వ తారీకు రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశించారు. గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. దీంతో “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా లో రికార్డులు సృష్టించాలని అభిమానులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇలాంటి తరుణంలో మహేష్ బాబు సోషల్ మీడియా టీం నుండి ఊహించని వార్త వచ్చింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాలు మరియు కేసులు పెరుగుతూ ఉండటంతోపాటు పరిస్థితులు సరిగ్గా లేని నేపథ్యంలో… ఎస్.వి.పి నుండి ఎటువంటి అప్డేట్ రాదని దయచేసి అభిమానులు నిరుత్సాహం చెందడం టూ లెటర్ రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా మహేష్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
Read More: Mahesh Babu: కోవిడ్ వచ్చిన సమయంలో మహేష్ బాబు చేసిన బిగ్ హెల్ప్ ఇటీవల బయటపెట్టిన అనిల్ రావిపూడి..!!
“సర్కారు వారి పాట” సినిమాలో ఏదో ఒక లుక్ వస్తుందని.. భావించిన అభిమానులు తాజా ప్రకటన తో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాది కృష్ణ బర్త్ డే నాడు మహేష్ తాను నటించే సినిమాకి సంబంధించి ఈ ఫోటో లేదా వీడియో రిలీజ్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఈసారి కూడా వస్తుందని భావించిన అభిమానులకు… ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది. దేశంలో పరిస్థితులు సరిగా లేని నేపథ్యంలో ఇలాంటి తరుణంలో రిలీజ్ చేస్తే బాగుండదని మహేష్ కూడా భావించినట్లు ఫిల్మ్ నగర్ టాక్.