Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోల కొడుకులు ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ డామ్ సంపాదించి.. ఇండస్ట్రీలో టాప్ హీరో లుగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్, కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్, నాగార్జున వారసుడిగా అఖిల్, నాగచైతన్య.. సినిమా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం వీళ్ళు వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు.
ఇక ఇదే సమయంలో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊరిస్తున్నారు. ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ టాక్. గతంలోనే గౌతమ్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన “1 నేనొక్కడినే” సినిమా లో… మహేష్ చిన్ననాటి పాత్ర వేయడం జరిగింది. అయితే ఈసారి పూర్తి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కొడుకుని సిద్ధం చేస్తున్నట్లు ఈ తరహాలో ఇటీవల బాలకృష్ణ తో ఆహా ఓటిటి లో జరిగిన ఇంటర్వ్యూలో మహేష్ హింట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మరో మూడు నాలుగు సంవత్సరాలలో గౌతమ్ గ్యారెంటీగా సినీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు.. మహేష్ వ్యాఖ్యానించినట్లు ఆ న్యూస్ యొక్క సమాచారం. దీంతో మహేష్ ఫ్యాన్స్ గౌతమ్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో అని తెగ డిస్కషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో.. మార్చి నెల నుండి పాల్గొననున్నాడు. ఆ తర్వాత వెంటనే రాజమౌళి ప్రాజెక్టు మహేష్ స్టార్ చేయనున్నట్లు సమాచారం.