Kaalavathi Song: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు “సర్కారు వారి పాట” కళావతి సాంగ్ మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే. తమన్ అందించిన మెలోడీ మ్యూజిక్ … సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తుంది. లైకులు పరంగా వ్యూస్ పరంగా… అనేక రికార్డులు సాధిస్తుంది. పైగా మహేష్ సాంగ్ కి వేసిన స్టెప్పులు మరింతగా అభిమానులను అలరించడం తో.. పాటు మహేష్ బాబుని డైరెక్టర్ పరుశురాం అద్భుతంగా చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.
సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్ గా మారిన ఈ కళావతి సాంగ్ కి తాజాగా మహేష్ బాబు కూతురు సితార స్టెప్పులు వేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సేమ్ తండ్రి మాదిరిగానే సితార కూడా అదే స్టైల్ లో స్టెప్పులు వేసి…ఫ్యాన్స్ నీ ఉర్రూతలూగించింది. సితార వేసిన స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే బ్యాలెన్స్ వర్క్ మొత్తం పూర్తి కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా మే 12వ తారీకు వేసవి కానుకగా సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట మరో “పోకిరి” మాదిరిగా ఉంటుందనీ ఇప్పటికే కామెంట్లు చేయడం జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పైగా మేక్ఓవర్ గతంలోకంటే భిన్నంగా మెడ పై టాటూ తో పాటు లాంగ్ హెయిర్ తో మహేష్ లుక్ ఉండటంతో.. సినిమా స్టోరీ ఏ తరహాలో బయట భారీ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.