MaheshBabu – Trivikram: మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మరో క్లాసిక్..!!

Share

MaheshBabu – Trivikram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. మహేష్ తన 28వ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్..!! సంబరాలు చేసుకుంటున్న అభిమానులు..

MaheshBabu - Trivikram: combination movie update
MaheshBabu – Trivikram: combination movie update

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు క్లాసిక్ లు గా నిలిచాయి.. దీంతో మరో క్లాసిక్ సినిమా రానుందంటూ అభిమానులు అంటున్నారు.. 11  సంవత్సరాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ ని పూర్తి డిఫరెంట్ రోల్ లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.. ఈ సినిమాకు డైరెక్టర్ గా ఎస్.రాధాకృష్ణ వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. 2022 వేసవిలో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది..  మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది..

 

ప్రస్తుతం మహేష్ బాబు గీతగోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ నెల మొదటి రోజే సర్ ప్రైజింగ్ అప్డేట్ ఇస్తున్న మహేష్.. నెలాఖరున కూడా అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

 


Share

Related posts

Aging మీ వయస్సుకన్నా పదేళ్లు చిన్నగా కనిపించాలా? అయితే ఈ వ్యాయామం చేయండి!!

Kumar

BJP : గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి స్వయంకృతాపరాధమేనా!పోస్టుమార్టం ప్రారంభిన కమలనాథులు!

Yandamuri

హద్రాత్ వెళ్ళకుండా రాహుల్‌, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

Special Bureau