Makhana: సన్నగా నాజూగ్గా కనిపించాలని అందరికీ ఉంటుంది.. బరువు తగ్గాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు.. ఇందుకోసం ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తూ ఉంటారు.. మీరు కూడా బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అలిసి పోయారా..!? ఫలితం లేదా..!? అయితే ఈ చిట్కాలను ప్రయత్నించండి.. సులువుగా బరువు తగ్గడంతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది..!!
మఖాన లో ప్రోటీన్లు, ఫైబర్ తో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. బరువు తగ్గడానికి ఆరోగ్యంగా ఉండటానికి తీసుకుని కెలోరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే మఖాన తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండడంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వలన ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండటంతోపాటు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది.
ఒక కప్పు మఖాన లో 106 కెలోరీలు ఉంటాయి. ఇందులో కెలోరీలు తక్కువగా ఉండటంతో బెస్ట్ స్నాక్స్ గా దీన్ని తీసుకోవచ్చు. ఇవి తినడం వల్ల పొట్ట నిండుగా ఫీలింగ్ కలుగుతుంది. దీనిలో సాచురేటెడ్ కొవ్వు ఉండటం వల్ల అవి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఆహారం కావడంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహయపడతాయి.