మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లిన సమయంలో ఏ పని కోసం వెళ్తామో దానికోసమే వెళ్లాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు రాకుండా పని పూర్తి చేసుకొని బయటకు రాగలం. అలా కాదు అని అన్నింటిలోకి నేను ఇన్వాల్వ్ అవుతా నా పని నాదే అంటే ఖచ్చితంగా ఏదొక సమస్య వచ్చి నష్టపోయే బయటకు వస్తాం.
ఇక అలానే ఓ వ్యక్తి కూడా జూ కి వెళ్లాడు. అక్కడ ఏం చెయ్యాలి? సైలెంట్ గా జంతువులను చూసి రావాలి. లేదా టచ్ చేసి వెళ్ళిపోవాలి.. అంతేకాని జూ లో జంతువులతో ఆడుకోవాలనుకోకూడదు.. ముందే ఆకలితో ఉంటాయ్ కదలిచ్చారో చచ్చిపోతారు. ఇక అలానే ఓ వ్యక్తి సింహం ముందు అతి చేశాడు.. దాని నుంచి తప్పించుకునేందుకు తలప్రాణం తోకకొచ్చింది!
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ వ్యక్తి సింహం నోట్లో చెయ్యి పెట్టి నానాపాట్లు పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సింహం నోట్లో ఏమందో చూడాలనుకున్నాడో ఏమో తెలీదు కానీ చెయ్యి పెట్టాడు. ఇక ఆ సింహం నుంచి బయటపడేందుకు గట్టిగట్టిగా అరిచాడు. కానీ అతడిని సందర్శకులు ఎవరు కూడా కాపాడకపోగా ఆ వీడియోను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్ గా మారింది. మరి మీరు ఓసారి ఆ వీడియోను చూసేయండి.