తల వ్రెంటుకల ప్రముఖ్యతను ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. దానితోనే అందం వస్తుందని చాలా మంది నమ్ముతారు.అందుకే దానికి అంత శ్రద్ధ తీసుకుంటారు. అవి లేకపోతే పెళ్లిలు కూడా కావాని అబ్బాయిలు భయపడుతుంటారు.ఒకవేళ అలా వ్రెంటుకలు ఊడిపోతే దానికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. అయితే ఇగ విషయంలోకి పోతే.. బట్టతల ఉన్న విషయాన్ని దాచి పెట్టి ఓ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లైన కొన్ని రోజులకు అతని భర్యకు ఈ విషయం తెలిసింది. దాన్ని చిన్న విషయమని అత్తమామ చెప్పినా ఆమె వినలేదు. తన భర్తకు బట్టతల ఉందన్న విషయాన్ని చెప్పకుండా పెళ్లి చేసుకున్నడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
27 ఏళ్ల ఓ అమ్మాయి అకౌంటెంట్‌గా జాబ్ చేస్తోంది. నెల కింద పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయింది. పెళ్లైన కొన్ని రోజులకే తన భర్తకు బట్టతల ఉందని ఆమెకు తెలిసింది. ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావని భర్తను నిలదీసింది. ఈ రోజుల్లో అందరికీ వస్తుంది.. అదేం పెద్ద మ్యాటర్ కాదని అత్తామామ ఆమెకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమే వినలేదు. తన భర్త చేసిన మోసన్ని సహించలేక పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ముంబైలోని మీరా రోడ్డులో నివాసం ఉంటే 29 ఏళ్ల అతను ఒక ప్రైవేట్ కంపనీలో జాబ్ చేస్తున్నాడు. అతడికి బట్టతల ఉండటంతో కొంత కాలంగా విగ్గు వాడటం ప్రారంభించాడు. నెల రోజుల ముందు అలాగే పెళ్లి చూపులకు వెళ్లాడు.. ఆమెను పెళ్లికూడా చేసుకున్నాడు. సంబంధం మాట్లాడేటప్పుడు కూడా తనకు బట్టతల ఉన్న విషయాన్ని వారికి చెప్పలేదు. అలా దాచిపెట్టిన విషయం పెళ్లైన కొన్ని రోజులకు భార్యకు తెలిసింది.
దీంతో ఆగ్రహించిన ఆమె తన భర్తకు బట్టతల ఉన్న విషయం పెళ్లికి ముందు చెప్పలేదని.. చీట్ చేశాడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నయా నగర్ పోలీసుల ఆమె ఫిర్యాదు చేసింది.అలాగే భర్తను సమర్థించిన అతడి తల్లిదండ్రులపైనా కూడా ఫిర్యాదు చేసింది. అతనికి బట్టతల ఉందన్న విషయం పెళ్లికి ముందే తెలిస్తే.. అతన్ని పెళ్లి చేసుకోకపోతుంటి అని తన బాధను పోలీసులతో చెప్పుకుంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. తన పరువుకు నష్టం వాటిళ్లిందని ఫిర్యాదులో పేర్కొంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారు. నిందితుడు బెయిల్ కావాలని న్యాయస్ధానాన్ని కోరాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?