మరో పరువు హత్య.. కూతురి భర్తను బెల్టుతో ఉరేసిన తండ్రి!

Share

2020 సంవత్సరంలో బతుకుతున్న పరువు హత్యలు తగ్గడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఈ కాలంలో అసంభవంగా మారింది. కొంచం చదువుకొని సంపాదించినా వారు అయితే ప్రేమ పెళ్లిని గొప్పగా అనుకుంటున్నారు కానీ మిడిల్ క్లాస్ వారికీ ఇప్పటికి ప్రేమ అంటే చిన్న చూపే.. పరువే ముఖ్యం. ఇక అలానే కులం మతం తేడా లేకుండా ప్రేమలో పడినందుకు మరో యువకుడు బలయ్యాడు.

ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మాగడి ప్రాంతానికి చెందిన యువకుడు లక్ష్మీపతి, అదే ప్రాంతానికి చెందిన యువతి గతంలో ఓ ఫ్యాక్టరీలో పని చేశారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న వారు పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కులం వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు.

దీంతో ఇంటి నుంచి పారిపోయ్ వారు ఇద్దరు పెళ్లి చేసుకోగా అమ్మాయి తండ్రి పగబట్టాడు. తనను కాదని వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని కోపం పెంచుకున్నాడు. దీంతో యువతీ కుటుంబసభ్యులు ప్లాన్ ప్రకారం కూతురు ఇంటికి వెళ్లి వారిని ఇంటికి రావాలని, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా అని చెప్పాడు. దీంతో సరే అని తండ్రిని నమ్మి వెళ్లిన ఆ ప్రేమికులకు కన్నీళ్లే మిగిలాయి.

యువకుడు నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి ఫుల్ గా మద్యం తాగిపించారు. అనంతరం అతన్ని కులం పేరుతో దారుణంగా అవమానించి యువతిని వదిలి వెళ్లిపోవాలని వారించారు. కానీ అతడు ఒప్పుకోకపోవడంతో అతన్ని కొట్టి దారుణంగా బెల్టుతో ఉరేసి చంపేశారు. ఈ విషయం పోలిసులకు తెలియడంతో యువతీ తండ్రిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


Share

Related posts

Allu Arjun: పాన్ ఇండియా లెవెల్ లో రికార్డుల వేట అప్పుడే స్టార్ట్ చేసిన అల్లు అర్జున్..??

sekhar

RRR – Radhe shyam: ప్లాన్ మార్చుకోవాల్సిందే..ఇది మేకర్స్‌కు పెద్ద షాక్..!

GRK

Ys Jagan: జగన్ డ్రెస్సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాంగోపాల్ వర్మ..!!

sekhar