కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి.. ఎలా సోకుతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇప్పటి వరకు దీనికి మందు కూడా కనిపెట్టలేదు. ఇక ఈ వైరస్ తర్వాత జీవితం ఎప్పటికీ.. ఇక ముందులా సాధారణంగా ఉండదంటూ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందరూ మూతికి మాస్క్ లు ధరిస్తూ బయట అడుగుపెడుతున్నారా.. ఇక ప్రతి విషయంలోనూ మనిషి జీవన విధానంలో మార్పులు చేసుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ ఊహించని జీవన విధానాన్ని ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు. వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు చూద్దాం..కరోనా వైరస్ తొలుత చైనాలోనే మొదలైంది. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడ సినిమా థియేటర్లు కూడా ఓపెన్ చేశారు. అయితే.. కోవిడ్ భయంతో అక్కడ థియేటర్లలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన బీన్ బ్యాగుల్లో ప్లాస్టిక్ కవర్లు ఏర్పాటు చేశారు సముద్రాల వద్ద ఎప్పుడూ లైఫ్ గార్డ్స్ ఉంటారన్న విషయం తెలిసిందే.
కాగా.. ఆ లైఫ్ గార్డ్ ఒకరు బెల్జియంలో ముఖానికి ఫేస్ షీల్డ్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లడం గమనార్హం. కరోనా భయంతో వారు అలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జకార్తాలోని డునియా ఫాంటసీ అమ్యూజ్మెంట్ పార్క్ వద్ద ఓ స్టాల్ ని మొత్తం ప్లాస్టిక్ కవర్ తో కప్పేయడం గమనార్హం. ఆ పక్కన ఓ సెక్యురిటీ గార్డ్ మూతికి మాస్క్ వేసుకొని అక్కడకు వచ్చే వారిని పర్యవేక్షిస్తున్నాడు.
లండన్ లోని ఆక్స్ఫర్డ్ స్ట్ర్రీట్ లో ఓ వ్యక్తి సర్జికల్ మాస్క్ ని అండర్ వేర్ లాగా మార్చుకొని ధరించి… నడుచుకుంటూ వెళ్తున్నాడుతమ పిల్లలను తాము హత్తుకోవడానికి కూడా మూతికి మాస్క్ తోపాటు.. ఒంటినిండా పీపీఈ కిట్లు ధరించడం గమనార్హం. కాలిఫోర్నియాలో అక్కడి స్థానికులు ఓ కాన్సర్ట్ కి ఇలా అటెండ్ అయ్యారు. మెక్సికోలోని ఓ రెస్టారెంట్లో సమాజిక దూరం పాటించడానికి రెండు చైర్లకు మధ్యలో టెడ్డీబేర్ బొమ్మలను ఏర్పాటు చేశారు.