Varun Tej: మెగా కాంపౌండ్ హీరోలలో మొదటి నుండి తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న హీరో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. దాదాపు ఆరడుగుల కంటే హైట్ తో పాటు… చూడచక్కని కళ్ళతో మెగా హీరోల లోనే మంచి అందగాడు గా.. ఇండస్ట్రీలో విజయవంతంగా రాణిస్తున్నాడు. సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం లో కూడా చాలా డిఫరెంట్. కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే ఇమేజ్.. ఉండిపోకుండా క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ నీ అలరించే విధంగా… ప్రేమకథలు చేస్తూనే మరో పక్క ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టులు కలిగిన ప్రాజెక్టులను కూడా వరుణ్ తేజ్ చేస్తున్నాడు. “ఫిదా” తో క్లాస్ ఆడియన్స్ ని అలరించిన.. వరుణ్ తేజ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో “వాల్మీ”కి సినిమాతో మాస్ ఆడియన్స్..నీ ఎంటర్టైన్ చేయడం జరిగింది.
ఇక ఆ తర్వాత “ఎఫ్2” సినిమా తో వెంకటేష్ తో మల్టీస్టారర్ సినిమా.. చేసి తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ తన కొత్త సినిమా “గని” రిలీజ్ చేయడానికి రెడీ కావడం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు విశాఖపట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సినిమా గ్యారెంటీ హిట్టే అని ఆల్రెడీ చూసినట్లు బన్నీ చెప్పాడు. అయితే మరి కొద్ది రోజుల్లో సినిమా విడుదల అవుతున్న తరుణంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వరుణ్ తేజ్.. తాజా ఈ కార్యక్రమంలో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళితే ప్రస్తుతం పెళ్లి పై అసలు ఆలోచన లేదని.. చాలా ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని.. ఈ ఏడాది అసలు పెళ్లి అనేది ఆలోచించడానికి కూడా టైం లేదని అన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడం జరిగిందని వరుణ్ చెప్పటం జరిగిందట. మెగా హీరోలలో ఇంకా పెళ్లి కావాల్సిన వారు లిస్ట్ చూస్తే సాయి ధరమ్ తేజ్.. అతని తమ్ముడు వైష్ణవి తేజ్ తో పాటు వరుణ్ తేజ్.. ఇంకా అల్లు శిరీష్ ఉన్నారు. నాగబాబు ఇంట్లో గత ఏడాది నిహారిక పెళ్లి అయిపోవటంతో.. ఇంకా వరుణ్ మాత్రమే మిగిలి ఉండటంతో చాలా వరకు ఇటీవల వరుణ్ పెళ్లి గురించి వార్తలు వెలువడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈ ఏడాది మాత్రం పెళ్లికి సంబంధించి ఆలోచించడానికి కూడా టైం లేదని అన్ని సినిమాలు ఒప్పుకున్నట్లు వరుణ్ తేజ్ క్లారిటీ ఇవ్వటం జరిగిందట.